వృథాని పచ్చగా మార్చేద్దాం

ఈమధ్య ప్రతి ఇంట్లోనూ బయటి ఆహారం తెచ్చుకున్న డబ్బాలు చాలానే ఉంటున్నాయి. వాటిని వృథాగా పారేయడం ఎందుకు? చక్కగా వాటిల్లో కొత్తిమీర, మెంతికూర, పుదీనా.. ఇతరత్రా ఆకుకూరల్ని పెంచేయండి. మిగిలిపోయిన కూరగాయల వ్యర్థాలను, మట్టిని పొరలుగా వేసి ఎరువు కోసమూ వాడుకోవచ్చు. ఫుడ్‌ బాక్సులతో పాటు నీళ్ల బకెట్‌లూ, ప్లాస్టిక్‌ టబ్‌లనూ ఇందుకోసం వాడుకోవచ్చు...

Published : 17 Nov 2021 01:59 IST

మొక్కలు పెంచాలన్న ఆసక్తి ఉండాలే కానీ... వృథాగా పడి ఉన్న వేటినైనా అందుకు అనువుగా మార్చుకోవచ్చు. అదెలాగంటే...

మధ్య ప్రతి ఇంట్లోనూ బయటి ఆహారం తెచ్చుకున్న డబ్బాలు చాలానే ఉంటున్నాయి. వాటిని వృథాగా పారేయడం ఎందుకు? చక్కగా వాటిల్లో కొత్తిమీర, మెంతికూర, పుదీనా.. ఇతరత్రా ఆకుకూరల్ని పెంచేయండి. మిగిలిపోయిన కూరగాయల వ్యర్థాలను, మట్టిని పొరలుగా వేసి ఎరువు కోసమూ వాడుకోవచ్చు. ఫుడ్‌ బాక్సులతో పాటు నీళ్ల బకెట్‌లూ, ప్లాస్టిక్‌ టబ్‌లనూ ఇందుకోసం వాడుకోవచ్చు.

కాస్త పెద్ద డబ్బాలు ఉంటే జామ, బొప్పాయి వంటి పండ్ల చెట్లనూ పెంచుకోవచ్చు. చిన్న చిన్న డబ్బాల్లో పూల మొక్కలు పెంచవచ్చు. వాటిల్లో బరువు తూగకుండా కోకోపీట్‌ కలిపిన మట్టి మిశ్రమాన్ని, పోషకాల్ని నింపి తక్కువ లోతులో పెరిగే గడ్డి గులాబీ (పోర్ట్యులాకా), మరువం, డయాంతస్‌ వంటివి నాటితే సరి. పూలు విరబూస్తాయి.

ప్లాస్టిక్‌ డబ్బాలే కాదు... లోహపు పాత్రలు, పాతవైపోయిన ఫ్రిజ్‌లు, కుర్చీలు, బ్యాగులు, చెప్పులు, సీసాలు, టైర్లు వంటి అన్నింటిలోనూ కావలసిన మొక్కల్ని పెంచుకోవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్