భేషైన ఇంటి కోసం...

అందమైన చూడముచ్చటగా ఉండే ఇల్లు కావాలని ప్రతి ఇల్లాలికీ ఉంటుంది. మీకూ అదే కోరికా? ఉన్నంతలో ఇంటిని చక్కగా సర్దుకోవచ్చని చెబుతున్నారు ఇంటీరియర్‌ డిజైనర్లు. అందుకోసం కొన్ని సూచనలు... మార్కెట్లో వేల రకాల టైల్స్‌ లభ్యమవుతాయి. జాగ్రత్తగా చూసి చక్కటివి ఎంచుకోండి. సగం అందం వాటి వల్లే వస్తుంది. గోడలకు లేత వర్ణాలు, కాంట్రాస్ట్‌ రంగుల డిజైన్‌ను బోర్డర్‌గా వేస్తే ఆకర్షణీయంగా ఉంటాయి.

Updated : 24 Nov 2021 05:33 IST

అందమైన చూడముచ్చటగా ఉండే ఇల్లు కావాలని ప్రతి ఇల్లాలికీ ఉంటుంది. మీకూ అదే కోరికా? ఉన్నంతలో ఇంటిని చక్కగా సర్దుకోవచ్చని చెబుతున్నారు ఇంటీరియర్‌ డిజైనర్లు. అందుకోసం కొన్ని సూచనలు...

మార్కెట్లో వేల రకాల టైల్స్‌ లభ్యమవుతాయి. జాగ్రత్తగా చూసి చక్కటివి ఎంచుకోండి. సగం అందం వాటి వల్లే వస్తుంది. గోడలకు లేత వర్ణాలు, కాంట్రాస్ట్‌ రంగుల డిజైన్‌ను బోర్డర్‌గా వేస్తే ఆకర్షణీయంగా ఉంటాయి.

బయటి వస్తువులే కాదు.. ఉన్నవి సక్రమంగా అమర్చడంలోనూ అందం దాగి ఉంటుంది. కాబట్టి, టేబుళ్లు, కబోర్డ్స్‌ను ఎప్పటికప్పుడు సర్దండి. అనవసర సామగ్రి పేరుకుంటే తీసేయండి. మంచాల మీద పరచిన దుప్పట్లను బట్టీ పడకగది శోభిస్తుంది. చక్కటి రంగులూ డిజైన్ల బెడ్‌షీట్లు, పిల్లో కవర్లను ఎంచుకోండి.

డైనింగ్‌ టేబుల్‌ మీద వస్తువులు పరవకండి. ఒక సీసా లేదా బౌల్లో నీళ్లు పోసి దానిలో పూలు వేయండి. ఇతర ఏ ముస్తాబులూ వాటికి సాటిరావు. ఏదైనా టూర్‌ వెళ్లినప్పుడు అక్కడ ప్రత్యేకమైనవీ, ఇంటి అలంకరణకు తోడ్పడేవి ఏమైనా ఉంటే గమనించి కొనుగోలు చేయండి. తీయటి జ్ఞాపకంగా ఉండటంతోపాటు ఇంటి అందమూ పెరుగుతుంది.

ఇంటిని ఏళ్ల తరబడి ఒకేలా ఉంచాలనుకోవద్దు. అప్పుడప్పుడూ టీవీ, సోఫాలు, బీరువాల దిశ మార్చండి. ఆ మార్పు కొత్తదనాన్ని, కొంగొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది. నిరుపయోగంగా ఉన్న వస్తువులను బాగుంటే అవసరమైన వారికి ఇచ్చేయండి. ఇల్లు కిక్కిరిసి ఉండటంలో కాదు, కొంత ఖాళీగా ఉండటంలోనే అందం.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్