ఆకట్టుకునేలా.. లివింగ్‌ రూం
close
Published : 29/11/2021 01:27 IST

ఆకట్టుకునేలా.. లివింగ్‌ రూం

ఇప్పుడంతా బిజీ జీవితమే. అంతా ఒకచోట కలిసి కూర్చుని సంతోషంగా గడిపే సమయమే తగ్గిపోతోంది. దొరికిన కాసేపు టైం కూడా లివింగ్‌ రూంలోనే గడుస్తుంది. అంత ముఖ్యమైన ప్రదేశాన్ని మరింత అందంగా తీర్చిదిద్దితే ప్రతి ఒక్కరి మనసు ఉల్లాసంగా ఉంటుంది అంటున్నారు ఇంటీరియర్‌ డిజైనర్లు. దాన్ని ఎలా అలంకరించుకోవాలో చెబుతున్నారు.

* గది గోడలకు లేత వర్ణాలు అయితేనే మనసుకు ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇరుకుగా అనిపించకుండా సర్దుకోవాలి. గోడల వర్ణాలకు తగినట్లుగా సోఫా, దివాన్‌ సెట్స్‌, కుర్చీలుండాలి. వీటికి మధ్యలో కింద ముదురు వర్ణంలో మెత్తనైన తివాచీ లేదా మ్యాట్‌లాంటిది వేస్తే ఆకర్షణగా కనిపిస్తుంది. సోఫాలో వేసే కుషన్‌ దిండ్ల కవర్లు ముదురు వర్ణంలో ఉంటే ప్రత్యేకంగా ఉంటాయి.

* పసుపు రంగు లైట్లు గదికి ప్రత్యేకతను తెచ్చిపెడతాయి. పనితనం ఉన్న షాండ్లియర్‌ను ఎంపిక చేసుకోవాలి. రంగురంగుల క్రిస్టల్స్‌ లేదా సీషెల్స్‌తో చేసినదైతే మరింత అందంగా కనిపిస్తుంది. గది మధ్యలోని టీపాయిపై సగం నీరు నింపిన పారదర్శకంగా ఉండే జార్‌లో తాజా పూలను నింపాలి. దీనికి పక్కన కొన్ని సెంటెడ్‌ క్యాండిల్స్‌ను ఉంచాలి. వీటిని వెలిగించినప్పుడు గదంతా పరిమళభరితంగా, మనసు ప్రశాంతంగా అనిపిస్తుంది.

* చెక్క ఫ్రేమ్స్‌లో కుటుంబసభ్యుల ఫొటోను పెట్టి దాన్ని గది మూలగా చిన్న టేబుల్‌పై ఉంచాలి. గోడలకు అందమైన ఫ్రేమ్స్‌ను ఒకట్రెండు వేలాడదీయాలి. అతిగా పెడితే గది అందం తగ్గుతుంది.  ‌్ర కార్నర్‌ టేబుల్‌పై ఉంచిన ఫొటో పక్కన చిన్న మనీ ప్లాంట్‌ లేదా తాజా పూల కూజాను పెడితే చాలు. గదిలో ఈ తరహా అలంకరణ ఉంటే ప్రతికూల ఆలోచనలకు తావుండదు.

* గుమ్మం, కిటికీలకు టిష్యూ రకం లేదా సిల్క్‌ కర్టెన్లను ఎంచుకోవాలి. ఇవి కాంతిమంతంగా అనిపిస్తాయి. వీటిని కూడా గోడల వర్ణాలకు మ్యాచింగ్‌ అయ్యేలా తీసుకుంటే చాలు. కిటికీ వద్ద ఇండోర్‌ప్లాంట్‌ ఉన్న కుండీని పెడితే గదికి ప్రత్యేక అందం వచ్చినట్లే.


Advertisement

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని