శుభ్రతతో ఆరోగ్యం
close
Updated : 03/12/2021 06:16 IST

శుభ్రతతో ఆరోగ్యం!

ఇంటిల్లిపాదీ ఆరోగ్యంగా ఉంటే ఆనందంగా ఉంటుంది కదా. అయితే ఇంటి శుభ్రతా దీనిపై ప్రభావం చూపుతుంది. కాబట్టి, ఈ విషయంలో ఏం చేస్తున్నారో చూసుకోండి మరి!

ఇంటి శుభ్రతలో గదుల మూలలపైనా దృష్టి పెట్టాలి. సోఫాల మూలలు, బీరువా, డైనింగ్‌ టేబుల్‌, కుర్చీల కింద దుమ్ము చేరుకుంటుంది. వాటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి. అప్పుడే మెత్తని వస్త్రంతో ఫర్నిచర్‌నూ తుడిస్తే సరి! వారాంతాల్లో ప్రత్యేకంగా వీటి శుభ్రతకు సమయాన్ని కేటాయించాల్సిన పని ఉండదు.

* టీవీ ముందు, దాని టేబుల్‌పై ఇంటి, వాహనాల తాళాలు, దువ్వెనలు, పెన్నులు, ఫోన్‌లు ఉంచడం చాలామందికి అలవాటు. దాంతో అక్కడ మురికి, దుమ్ము పేరుకుంటాయి. తాళాల కోసం ప్రత్యేక స్టాండులు దొరుకుతున్నాయి. వాటిని హాల్‌లో గోడకు అమర్చుకోండి. బయటకు వెళ్లి వచ్చాక అక్కడ తగిలించేలా అలవాటు చేసుకుంటే వెతుక్కునే పనీ ఉండదు. పెన్స్‌, దువ్వెనలను వాటి స్టాండులో ఉంచితే శుభ్రం చేసుకోవడం తేలిక, చూడటానికి అందంగానూ ఉంటుంది.

* వృథాగా అనిపించిన వాటిని డస్ట్‌బిన్‌లోకి చేర్చేయండి. చెత్త పేరుకోదు. పిల్లలకూ ఈ అలవాటు చేయాలి. తడి, పొడి చెత్తను విడివిడిగా వేయడం, వాటిని ఏరోజుకారోజు ఖాళీ చేయడం వంటివీ చాలా అవసరం. వంటింటి అలమరల్లో కాగితాలను కనీసం వారానికోసారి మార్చాలి. సామాన్లు శుభ్రం చేసి బాగా ఆరిన తర్వాత సర్దుకుంటే బొద్దింకలు, పురుగులు చేరవు. సరకులు ఖాళీ అయిన డబ్బాలను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటే వాటికి త్వరగా పురుగు పట్టదు.

* గదుల కర్టెన్లు, తలగడ కవర్లను వారానికోసారి ఉతకడం, దుప్పట్లను మాసిన వెంటనే మార్చడం వంటివన్నీ పరిశుభ్రతలో భాగమే. ఎక్కడ తీసిన వస్తువును అక్కడే ఉంచే అలవాటు ఇంటిల్లిపాదీ అలవరుచుకోవాలి. అప్పుడే ఇల్లు అద్దంలా ఉంటుంది. అందరికీ ఆరోగ్యమూ.

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని