ఈ మూతలు సాగుతాయి...

ఇంట్లో చాలా పాత్రలకు మూతలు పోవడంతో వాటిని వినియోగించలేక వృథాగా ఉంచుతాం. కొన్నిసార్లు పుచ్చకాయ, దోసకాయ, అనాస, నారింజ, యాపిల్‌ వంటి పండ్లలో సగాన్నే వాడినప్పుడు...

Published : 06 Dec 2021 01:24 IST

ఇంట్లో చాలా పాత్రలకు మూతలు పోవడంతో వాటిని వినియోగించలేక వృథాగా ఉంచుతాం. కొన్నిసార్లు పుచ్చకాయ, దోసకాయ, అనాస, నారింజ, యాపిల్‌ వంటి పండ్లలో సగాన్నే వాడినప్పుడు మిగతా భాగాన్ని ఫ్రిజ్‌లో ఉంచినా నీరు పట్టినట్లుగా మారి రుచి కోల్పోయి వృథా అవుతాయి. ఇలాంటి సందర్భాల్లో కోసిన సగం పండ్లు తాజాగా ఉండేలా చేయడానికి రూపొందించినవే... ఈ సిలికాన్‌ లిడ్స్‌. ఇవి రీయూజబుల్‌ కూడా. వీటితో సగం కట్‌ చేసిన పండ్ల భాగంపై కవర్‌లా బిగించి ఫ్రిజ్‌లో ఉంచితే చాలు. వారమైనా పండ్లు తాజాగా ఉంటాయి. అలాగే కూరగాయలు, పండ్ల ముక్కలను భద్రపరిచే పాత్రలకు వీటిని మూతలా బిగించి ఫ్రిజ్‌లో ఉంచితే తాజాదనాన్ని కోల్పోవు. అన్ని సైజుల్లో, పలు వర్ణాల్లో సాగే గుణంతో ఉండే ఇవి వంటింట్లో ఎంతగానో ఉపయోగపడతాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్