ఆకర్షణీయంగా.. అందంగా..

చిన్న ఇంటినైనా అపురూపంగా కనిపించేలా తీర్చిదిద్దుకోవచ్చు అంటున్నారు ఇంటీరియర్‌ డిజైనర్లు. ఆయా గదులను చక్కగా సర్దుకుంటే చాలు. చూడటానికి ఆకర్షణీయంగా ఉండటమే కాదు...

Published : 06 Dec 2021 01:24 IST

చిన్న ఇంటినైనా అపురూపంగా కనిపించేలా తీర్చిదిద్దుకోవచ్చు అంటున్నారు ఇంటీరియర్‌ డిజైనర్లు. ఆయా గదులను చక్కగా సర్దుకుంటే చాలు. చూడటానికి ఆకర్షణీయంగా ఉండటమే కాదు... ఆ ఇల్లాలి సృజనాత్మకతకు అందేవన్నీ ప్రశంసలే. మరెందుకాలస్యం. నిపుణుల సూచనలేంటో చూద్దాం.

రంగులు.. మనసును ఆహ్లాదంగా మార్చేవి వర్ణాలే. గదిగదినీ వేరుచేసేలా రంగులను ఎంచుకుంటే ప్రతిదీ ప్రత్యేకంగా కనిపిస్తుంది. ఇంటి బయటి గోడలకు ముదురు వర్ణాలైతే కొట్టొచ్చినట్లు కనిపిస్తాయి. ఏయే గదులకు ఎలాంటి రంగులు బాగుంటాయో ముందుగా కాగితంపై వేసి చూసుకోవాలి. అలాగే గది గోడలు, అలమరలకు రంగులు మ్యాచ్‌ అవ్వాలి. వీటితోపాటు ఫర్నిచర్‌కు నప్పేలా వర్ణాలను ఎంచుకోవాలి. అంతేకాదు, ప్రతి గదిలో ఇండోర్‌ మొక్క ఉంచాలి.    

లైటింగ్‌.. ఎండ గదిలో పడేలా కిటికీలుండాలి. ఇది గదులకు కొత్త అందాన్ని తెస్తుంది. వాకిట్లో ఎక్కువ వెలుతురిచ్చే లైటుతోపాటు చిన్నగా రంగుల సీరియల్‌ లైట్స్‌ను వేయాలి. హాలు, వంటగదిలో వ్యతిరేక దిశగా ఉన్న రెండు గోడలకు ఎక్కువ వెలుతురొచ్చే లైట్లు ఉండాలి. పడకగదిలో రీడింగ్‌ టేబుల్‌పై మాత్రమే పడేలా బెడ్‌ల్యాంప్‌, బెడ్‌కు తలవైపున కిందనుంచి వెలుతురొచ్చేలా లేతనీలి వర్ణం నైట్‌ల్యాంప్‌ బాగుంటుంది.. పిల్లల గదికి వెలుతురు ఎక్కువగా ఉండే లైట్ల ఏర్పాటుతోపాటు నైట్‌ల్యాంప్‌ లేతవర్ణాల్లో ఎంచుకోవాలి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్