ఈ బండకేసి బాదుదామా!

అమ్మమ్మ, అమ్మల కాలం వరకు బట్టలు ఉతకాలంటే బండపై బాదాల్సిందే. ఇప్పటికీ గ్రామీణ ప్రాంతంలో పెరట్లో బట్టలు ఉతకడానికి ఓ ప్రత్యేకమైన రాయి ఉంటుంది. గరుకుగా, ఎగుడుదిగుడుగా ఉండే దీని మీద దుస్తులను శుభ్రం చేస్తారు. అయితే ఈ ఫొటోలో కనిపిస్తోంది

Updated : 19 Dec 2021 05:09 IST

అమ్మమ్మ, అమ్మల కాలం వరకు బట్టలు ఉతకాలంటే బండపై బాదాల్సిందే. ఇప్పటికీ గ్రామీణ ప్రాంతంలో పెరట్లో బట్టలు ఉతకడానికి ఓ ప్రత్యేకమైన రాయి ఉంటుంది. గరుకుగా, ఎగుడుదిగుడుగా ఉండే దీని మీద దుస్తులను శుభ్రం చేస్తారు. అయితే ఈ ఫొటోలో కనిపిస్తోంది అలాంటిది కాకపోయినా ఎగుడుదిగుడుగా ఉండి దుస్తుల మురికిని చక్కగా వదలగొడుతుంది.
బాత్‌రూమ్‌లు, వాష్‌రూమ్‌లు, వంటగదిలో సింక్‌ దగ్గర ఎక్కడైనా దీన్ని సులభంగా వాడుకోవచ్చు. పాపాయిల దుస్తులు, రుమాళ్లు, కర్చీఫ్‌లు, సాక్స్‌, మాస్కులు... వీటిని సులువుగా పిండేయొచ్చు. తక్కువ సమయంలో బట్టల మురికిని వదిలించొచ్చు. అంతేకాదు దీన్ని చుట్టగా చుట్టి భద్రపరచొచ్చు. లేదా గోడకు వేలాడదీయొచ్చు. సిలికాన్‌, ప్లాస్టిక్‌... ఇలా రకరకాలుగానూ దొరుకుతుంది. ధర కూడా అందుబాటులో ఉంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్