ఆలోచనతో అందం

ప్రతి గదిలో కొంగొత్తగా చేసే అలంకరణ ఇంటి అందాన్ని రెట్టింపు చేస్తుంది. ఆలోచన ఉంటే చాలు... మరింత అపురూపంగా ఇంటిని తీర్చిదిద్దుకోవచ్చు.

Published : 21 Dec 2021 00:35 IST

ప్రతి గదిలో కొంగొత్తగా చేసే అలంకరణ ఇంటి అందాన్ని రెట్టింపు చేస్తుంది. ఆలోచన ఉంటే చాలు... మరింత అపురూపంగా ఇంటిని తీర్చిదిద్దుకోవచ్చు.

* ప్రతిఫలించేలా.. భావోద్వేగాలు ప్రతిఫలించేలా మగువల పోర్ట్రెయిట్స్‌ బ్లాక్‌ అండ్‌ వైట్‌ లేదా వర్ణాల్లో గోడపై చిత్రీకరిస్తే... లోపలికి వెళ్లగానే అద్భుతమైన భావనా ప్రపంచంలోకి అడుగుపెట్టినట్లుగా ఉంటుంది.

* ప్రకృతి.. పక్షులపై ప్రేమను హాలు గోడలపై ప్రదర్శించుకోవచ్చు. గుబురు వృక్షాలు.. వాటిపై కిలకిలరావాలు చేసే పక్షుల చిత్రాలను వాల్‌ పెయింటింగ్‌లా వేస్తే ప్రకృతి మన ఇంటిలో ఉన్న భావన కలుగుతుంది. మనసుకు నచ్చిన బర్డ్స్‌ పోస్టర్స్‌ను అటాచ్‌ చేసుకున్నా... చాలు. ఆ గది ఆహ్లాదకరంగా మారిపోతుంది.  

* కళాత్మకంగా.. వాల్స్‌ డెకరేషన్‌లో మెటల్‌ఆర్ట్‌ ఇంటి మొత్తానికే ప్రత్యేకత తెస్తుంది. బంగారం వర్ణంలో సృజనాత్మకంగా తీర్చిదిద్దే వాల్‌ట్రీ, బటర్‌ఫ్లై ట్రీ, లీఫ్‌ ఆర్ట్‌ వంటివి కళాత్మకంగా మాత్రమే కాకుండా రిచ్‌లుక్‌ను తెచ్చిపెడతాయి. ఏ గదికైనా ఇట్టే యిమిడిపోయే ఈ డిజైన్స్‌ లేత వర్ణం పెయింటింగ్‌ వేసిన గోడకు కొత్త అందాన్ని తీసుకొస్తాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్