Non Veg: నాన్‌వెజ్‌ వండుతున్నారా...

చాలామందికి నాన్‌వెజ్‌ అంటే ఇష్టం. తరచుగా వండుకుంటూ ఉంటారు. అయితే మాంసాన్ని జాగ్రత్తగా వండాలి. లేకపోతే చిన్న చిన్న పొరపాట్ల వల్ల కూరంతా పాడైపోవచ్చు. అలా కాకుండా ఉండాలంటే...

Updated : 21 Dec 2021 08:44 IST

చాలామందికి నాన్‌వెజ్‌ అంటే ఇష్టం. తరచుగా వండుకుంటూ ఉంటారు. అయితే మాంసాన్ని జాగ్రత్తగా వండాలి. లేకపోతే చిన్న చిన్న పొరపాట్ల వల్ల కూరంతా పాడైపోవచ్చు. అలా కాకుండా ఉండాలంటే...

ఓవర్‌ లోడింగ్‌... వద్దు! మాంసాహారం వండేటప్పుడు కాస్తంత ఓర్పు... నేర్పు కావాలి. కూరంతా చిన్న పాత్రలో వేసి ఉడికించకూడదు. ఇలా చేస్తే ఒక ముక్క వేగి మరొకటి వేగక కూర రుచి పోతుంది. కాబట్టి ఎంత మాంసం తీసుకుంటున్నారో దానికి రెట్టింపు పట్టే పాత్రను తీసుకోవాలి. అప్పుడే కూర చక్కగా ఉడుకుతుంది.

నాన్‌స్టిక్‌ కాకుండా... నూనె వాడకం తక్కువని అన్నింటికీ నాన్‌స్టిక్‌నే ఉపయోగిస్తుంటారు చాలామంది. అయితే మిగతా వంటల కంటే తక్కువ వేడిని ఇది గ్రహిస్తుంది. ముఖ్యంగా నాన్‌వెజ్‌ వంటకాలను ఎక్కువగా ఉడికించాలి. అందుకోసం ఎక్కువ ఉష్ణాన్ని అందించాల్సి ఉంటుంది. కాబట్టి చికెన్‌, మటన్‌ లాంటివి చేసేటప్పుడు గ్రిల్‌ పాన్‌, క్యాస్ట్‌ ఐరన్‌ పాన్స్‌ వాడితే బాగుంటుంది.

ఫ్రిజ్‌ నుంచి తీయగానే...  ఇది అస్సలు మంచి పద్ధతి కాదు. ఇలా చేస్తే మాంసం బయటకు ఉడికినట్లు కనిపించినా లోపల పచ్చిగానే ఉంటుంది. అవెన్‌లో చేసినా ఇట్లానే ఉంటుంది. కాబట్టి ఫ్రిజ్‌ నుంచి తీసిన మాంసాన్ని బయట పెట్టి గది ఉష్ణోగ్రతకు వచ్చిన తర్వాతే వండాలి.

పదే పదే కలపొద్దు!... కొందరు వండే సమయంలో అదేపనిగా మూత తీసి కలుపుతుంటారు. దీని వల్ల వేడి ఆవిరంతా బయటకు పోయి కూర త్వరగా ఉడకదు. అలాగే ముక్కలు పొడి పొడిగా మారి వంటకం రుచి, వాసన అన్నీ పోతాయి. కాబట్టి కూర గిన్నెలో వేశాక మూత పెట్టి కాసేపు ఉడకనివ్వండి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్