బుజ్జాయి రాకకు.. అంతా సిద్ధమేనా?

అమలకి మొదటి కాన్పు. ఇంట్లోకి బుజ్జిపాపాయి రాబోతోందనగానే ఇంటిల్లపాదీ ఆనందంలో మునిగి తేలిపోయారు. సంబరమే కాదు.. తన రాకకు తగ్గట్టుగా ప్రణాళికతో ఉండాలంటున్నారు నిపుణులు.

Published : 10 Jan 2022 01:13 IST

అమలకి మొదటి కాన్పు. ఇంట్లోకి బుజ్జిపాపాయి రాబోతోందనగానే ఇంటిల్లపాదీ ఆనందంలో మునిగి తేలిపోయారు. సంబరమే కాదు.. తన రాకకు తగ్గట్టుగా ప్రణాళికతో ఉండాలంటున్నారు నిపుణులు.

భార్యాభర్తలిద్దరూ ఉద్యోగులైతే ప్రసవ సెలవులకు ముందుగానే దరఖాస్తు చేసుకోవాలి. ప్రస్తుతం తండ్రికీ ఈ సెలవులిస్తున్నారు. తన సంస్థలో ఈ వెసులుబాటు ఉందోలేదో ముందే తెలుసుకోవాలి. చిన్నారి అవసరాలు, వాటికి ఎంత ఖర్చు అవుతుందో ముందు నుంచే ప్రణాళిక వేసుకోవాలి. తగ్గట్టుగా ఉందంటే సరే! లేకపోతే వెంటనే పొదుపు ప్రారంభించాలి. దుస్తులు, ఊయల వంటివి చిన్న ఖర్చులే కదా అని భావిస్తే పొరపాటే. ఇవన్నీ అదనపు ఖర్చులే. వాటిపైనా అవగాహన ఉండాలి. తగ్గట్టుగా సిద్ధమవ్వాలి. ప్రసవానికి ముందు, ఆ తర్వాత అని రెండు భాగాలుగా ఖర్చులను విడదీసుకోవాలి. అలాగే మందులు, చికిత్స, ఆసుపత్రి ఖర్చులతోపాటు పాపాయి అవసరాలనూ జతచేయడం మరవకూడదు. వీటన్నింటికీ విడివిడిగా పొదుపు చేయాలి. అత్యవసర నిధినీ సమకూర్చుకోవాలి. గర్భం దాల్చడానికి సిద్ధపడుతున్నప్పుడే దీనికంటూ ప్రత్యేక ఆర్థిక ప్రణాళికనూ వేసుకోవాలి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్