మొక్కలకు వెల్లుల్లి మందు

చలికాలంలో మొక్కలకు చీడ పీడల బాధ ఎక్కువ. సరైన ఎండ లేకపోవడం, వాతావరణంలో తేమ ఎక్కువగా ఉండటం కారణంగా కొన్నిరకాల పూలు, కాయగూరల మొక్కలకు పురుగు పడుతుంటుంది. వీటికి వంటింటి పదార్థాలతోనే

Published : 11 Jan 2022 01:35 IST

లికాలంలో మొక్కలకు చీడ పీడల బాధ ఎక్కువ. సరైన ఎండ లేకపోవడం, వాతావరణంలో తేమ ఎక్కువగా ఉండటం కారణంగా కొన్నిరకాల పూలు, కాయగూరల మొక్కలకు పురుగు పడుతుంటుంది. వీటికి వంటింటి పదార్థాలతోనే క్రిమిసంహారకాలను తయారు చేసి వేయొచ్చు. అదెలాగో చూద్దాం..

పొడి ఫంగస్‌కు.... గులాబీ, శంఖంపూలు, టొమాటో, గుమ్మడి, దోస తదితర మొక్కల ఆకులపై పౌడర్‌లా పడుతుంది. ఈ ఫంగస్‌ మొక్కను వారం పదిరోజుల్లో క్షీణించిపోయేలా చేస్తుంది. అలాకాకుండా ఉండాలంటే... నాలుగు చెంచాల వంటసోడా, ఎక్కువ గాఢతలేని సోప్‌ పౌడర్‌ ఓ చెంచా తీసుకుని అయిదులీటర్ల నీటిలో వేసి కరిగించాలి. ఈ మిశ్రమాన్ని మొక్కంతా పూర్తిగా తడిసేలా చల్లాలి. ఇలా చేస్తే మొక్క తిరిగి ఆరోగ్యంగా ఎదుగుతుంది.

ఆకులు వడలి... టొమాటో, వంగ వంటి కాయగూరల మొక్కల ఆకులు వడలి పోవడం లేదా గుండ్రంగా చుట్టుకుపోవడం ఉంటే ఫంగస్‌ ఉన్నట్లే. పది వెల్లుల్లిరేకలు, రెండు చెంచాల ఆవనూనె, నాలుగు మిరియాలు, నాలుగుచెంచాల నిమ్మరసం తీసుకొని అన్నింటినీ కలిపి రాత్రంతా నానబెట్టాలి. ఉదయాన్నే ఈ మిశ్రమాన్ని వడకట్టి నాలుగు చెంచాల ఈ ద్రావణాన్ని నాలుగున్నర లీటర్ల నీటిలో కలిపి ఫంగస్‌ ఉన్న చోట చల్లితే సరి. ఆకులన్నీ నల్లని మచ్చలతో ఉంటే మొక్కల్లో ఎదుగుదల కనిపించదు. దీనికి నివారణ ఎలా అంటే... నాలుగు చెంచాల యాపిల్‌ సిడర్‌ వెనిగర్‌ను నాలుగులీటర్ల నీటిలో కలపాలి. ఈ మిశ్రమాన్ని స్ప్రే సీసాలో పోసి మొక్కలపై చల్లాలి. రెండు మూడు వారాలకొకసారి ఇలా చేస్తే మొక్కలు ఆరోగ్యంగా ఎదుగుతాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్