మిమ్మల్ని మీరే మార్చేసుకోండి
close
Published : 20/01/2022 00:58 IST

మిమ్మల్ని మీరే మార్చేసుకోండి

పెద్ద పెద్ద అనారోగ్యాలు, ఊహించని విపత్తులే కాదు.. ఒక్కోసారి చిన్న చిన్న సమస్యలు లేదా బలహీనతలు కూడా మన మనసులో నస పెట్టి, అసంతృప్తి కలిగిస్తాయి. అయితే వాటి మీద తగినంత ధ్యాస పెట్టకపోవడం లేదా ఎలా పరిష్కరించుకోవాలో తెలీకనే ఈ ఇబ్బంది. మరి ఏం చేయాలి?

ఏమాత్రం ఖాళీ దొరికినా టీవీ ముందు కూర్చుంటున్నారా? ఒక్కోసారి చేయాల్సిన పనులను వాయిదా వేసి మరీ సీరియళ్లూ గట్రా చూస్తున్నారా? ఇది కూడా మీకు అసంతృప్తినే మిగులుస్తుంది. సమయమూ వృథా. కళ్లకూ చేటు. పైపెచ్చు పిల్లలు అనుసరించారంటే చదువుల్లో వెనకబడతారు. బదులుగా మంచి పుస్తకం చదవడం, మీ మనసు అర్థం చేసుకునే బంధుమిత్రులతో కాసేపు మనసారా మాట్లాడటం లాంటి ప్రత్యామ్నాయాలను ఎంచుకోండి. ఊరట, ఉత్సాహాం ఇస్తాయి.

చీరలూ నగలూ అంటూ తరచుగా షాపింగ్‌ చేస్తుంటారా? అందుకోసం డబ్బు ఖర్చుపెట్టేసి ఆనక బాధపడుతుంటారా? మీరు దుబారా చేస్తున్న ఆ డబ్బు ఎందరు అన్నార్తుల ఆకలి తీర్చగలదో ఆలోచించండి. మీ డబ్బంతా దానం చేయనవసరం లేదు. సరదాలకోసం వెచ్చిస్తున్న సొమ్ములోంచి ఒకరిద్దరికి భోజనం పెట్టండి. వాళ్ల ముఖాల్లో కనిపించే వెలుగులే మిమ్మల్ని మార్చేస్తాయి. ఆత్మపరిశీలన చేసుకునేలా చేస్తాయి.


Advertisement

మరిన్ని