పని.. సులువిక!

ఇంటి పనికి కామాలే తప్ప ఫుల్‌స్టాప్‌ ఉండదు. ఇల్లాలు మెలకువగా ఉన్నంతవరకూ ఏదో ఒక పని ఉంటూనే ఉంటుంది. కుటుంబసభ్యులు పెరిగిన కొద్దీ పని కూడా పెరుగుతుంటుంది. కొన్ని కొన్ని సులువైన పద్ధతులు పాటిస్తే ఆ శ్రమ తగ్గి కాస్త విరామంగా, విశ్రాంతిగా గడపొచ్చు.

Published : 21 Jan 2022 00:41 IST

ఇంటి పనికి కామాలే తప్ప ఫుల్‌స్టాప్‌ ఉండదు. ఇల్లాలు మెలకువగా ఉన్నంతవరకూ ఏదో ఒక పని ఉంటూనే ఉంటుంది. కుటుంబసభ్యులు పెరిగిన కొద్దీ పని కూడా పెరుగుతుంటుంది. కొన్ని కొన్ని సులువైన పద్ధతులు పాటిస్తే ఆ శ్రమ తగ్గి కాస్త విరామంగా, విశ్రాంతిగా గడపొచ్చు.

రేసిన దుస్తులు తర్వాత మడవొచ్చులే అని కుర్చీలోనో, బట్టల స్టాండు మీదో పడేశారంటే ఇక ఆ పని వాయిదా పడిపోతుంది. అవసరమైనవి వెంటనే దొరకవు, చూడటానికీ నీట్‌గా ఉండదు. కనుక ఎప్పటివప్పుడు ఎక్కడివక్కడ మడిచి సర్దేయండి.

కొత్తదనం

రోజూ వాడని దుస్తులను ఉతికి బీరువాలో దాచేయండి. లేదంటే అడ్డుగా ఉంటాయి. వంటింటి సామగ్రి కూడా రోజూ వాడనివి అట్టపెట్టెలో పెట్టి అటక మీద పెట్టేయండి. ఏవి ఎందులో ఉన్నాయో గుర్తుంచుకుంటే అవసరమైనప్పుడు తీసుకోవచ్చు.

లేబుల్స్‌ అంటించండి

రవ్వ, సేమ్యా, నువ్వులు లాంటివి ఆయా డబ్బాల్లో పెట్టి మర్చిపోవడం మామూలే. అవసరమైనది దొరక్క ప్రతి డబ్బా మూత తెరిచి చూడటం విసుగ్గా ఉంటుంది. డబ్బాల మీద చిన్న లేబుల్‌ అంటిస్తే అవసరమైనది శ్రమ లేకుండా తీసుకోవచ్చు.

పరిశుభ్రంగా..

వంట ముగించినంతలో పని అయిపోయినట్లు కాదు. ఉల్లిపొట్టు, కూరగాయల చెక్కు లాంటివి తక్షణం తీసేయాలి. వాడిన పాత్రలన్నిటినీ కడిగి ఎక్కడివక్కడ పెట్టేయాలి. లేదంటే పరిశుభ్రతకు భంగం కలుగుతుంది.

చెప్పులు కూడా...

పిల్లలు దుస్తులకు సరిపోయే చెప్పులు కావాలంటారు. వాటిని చిందరవందరగా కాకుండా క్రమ పద్ధతిలో అమర్చుకుంటే సమయానికి అవసరమైనవి దొరకడమే కాదు, చూడటానికి అందంగా కనిపిస్తాయి.

ప్రణాళిక

నిద్ర లేవడం దగ్గరి నుంచి ఆయా పనులు చక్కబెట్టుకోవడం వరకు ప్రతి దానికీ ఓ చిన్న ప్రణాళిక ఉండాల్సిందే! అప్పుడే అన్నీ పద్ధతిగా జరిగిపోతాయి, వేళకు పూర్తవుతాయి. లేదంటే పనుల్లో అస్తవ్యస్తత,. అసమగ్రత తప్పదు.

ఇచ్చేయండి

దుస్తులు కొనేటప్పుడు బాగా అనిపిస్తాయి. ఆనక నచ్చవు లేదా కొలతలు సరిపోవు. అలాంటివి పడేయాలంటే మనసొప్పక అలాగే ఉంచడం కద్దు. కానీ వాటినలా ఉంచేసి స్థలాభావం కొనితెచ్చుకోవడం కంటే ఉదారంగా దానం చేయండి. మీకు నిరుపయోగమైనవి వేరొకరికి పనికొస్తాయి. ఇచ్చామన్న ఆనందమూ దక్కుతుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్