బుజ్జాయికి..తలస్నానం సులువిక
close
Published : 23/01/2022 00:48 IST

బుజ్జాయికి..తలస్నానం సులువిక!

చిన్నపిల్లలకు తలస్నానం చేయించడం తల్లులకు కొంత కష్టమే. ఎంత కళ్లు మండని షాంపూలను వినియోగించినా.. ఒక్కసారిగా తలమీద నుంచి పోసే నీరు వాళ్లకి ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బంది కలిగిస్తాయేమోనని భయపడతారు. దీన్ని చూడండి. చిన్నారుల తలస్నానానికే ప్రత్యేకంగా తయారైంది. బాత్‌ రిన్సర్‌గా పిలిచే దీని ముందు భాగంలో ఓ రబ్బరు లాంటి అమరిక ఉంటుంది. ఇది వాళ్ల తలకు సరిగా సరిపోయేలా ఉండి, ముఖం మీద నీరు రాకుండా చేస్తుంది. భలేగుంది కదూ! మీకూ కావాలనిపిస్తే ఈ కామర్స్‌ వేదికల్లో వెతికేయండి మరి.


Advertisement

మరిన్ని