దులిపేద్దామా...!

కొందరు ఇంట్లోని సామాన్లన్నింటిని పదే పదే శుభ్రం చేస్తుంటారు. మరికొందరు దుమ్ము కొట్టుకుపోతున్నా పట్టించుకోరు. ఈ రెండు విధానాలూ మంచివి కావు. మనకు రక్షణ, సంతోషాన్నిచ్చే పొదరింటిని శుభ్రంగా, అందంగా పెట్టుకోవాలి.

Updated : 27 Jan 2022 04:40 IST

కొందరు ఇంట్లోని సామాన్లన్నింటిని పదే పదే శుభ్రం చేస్తుంటారు. మరికొందరు దుమ్ము కొట్టుకుపోతున్నా పట్టించుకోరు. ఈ రెండు విధానాలూ మంచివి కావు. మనకు రక్షణ, సంతోషాన్నిచ్చే పొదరింటిని శుభ్రంగా, అందంగా పెట్టుకోవాలి. ముఖ్యంగా ఏయే సమయాల్లో ఎలా శుభ్రం చేయాలో తెలుసుకుందామా...

రోజూ... గదులన్నింటిలోని మంచాలు, కుర్చీలు... లాంటి వాటిని తప్పనిసరిగా శుభ్రం చేయాలి. సింక్‌ను కడగడం మరవొద్దు. అలాగే రోజూ చెత్తను బయట పడేయడమూ తప్పనిసరి.

అన్ని గదుల్లో వెలుతురు, గాలి వచ్చేలా తలుపులు కిటికీలు, బార్లా తెరిచి కాసేపు అలానే పెట్టాలి.

వారానికి... మిక్సీ, గ్రైండర్‌, అవెన్‌లను తప్పక శుభ్రం చేయాలి. బాత్రూమ్‌లు, టబ్బులు, షవర్‌, సింకులు.... అన్నింటినీ తళతళా మెరిపించాలి. అరలనూ దులపాల్సిందే. కార్పెట్‌లు, సోఫాలు, రగ్గులన్నింటినీ శుభ్రపరచాలి. ఇంట్లో చిన్నారులుంటే రోజు మార్చి రోజు తడిగుడ్డ పెట్టాలి. కుదరకపోతే వారంలో రెండుసార్లు తుడిచినా ఫరవాలేదు.

పదిహేను రోజులు/ నెలకోసారి....

అవెన్‌ లోపల తుడిచి అది పనిచేసే విధానాన్ని పరిశీలించుకోవాలి.

దిండు గలేబులు, దుప్పట్లను తప్పక ఉతకాలి. ఇంట్లో వాడని వస్తువులను తీసేసి అవసరమైనవారికి అందజేస్తే సరి. అప్పటిదాకా దాచిన, పెట్టి మరిచిపోయిన ఆహార పదార్థాలను తీసేసి, ఫ్రిజ్‌ను శుభ్రం చేసుకోవాలి.

చెత్త డబ్బాలను క్రిమిరహితం చేయడానికి డిస్‌ఇన్‌ఫెక్ట్‌ను వాడాలి

మూడు నెలలకోసారి... వంటగదిలో గడువు ముగిసిన వస్తువులు, పదార్థాలను తీసేయాలి.

ప్రతి గదిలో పనికి వచ్చే, పనికి రాని వస్తువులను వేటికవే విభజించి బాగున్నవాటిని మరమ్మతులు చేసి పెట్టుకోవాలి. ఉపయోగపడవనుకుంటే వేరేవారికి ఇచ్చేయడమో, పారేయడమో చేయాలి. కిటికీలు, తలుపులనూ తుడవాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్