మడత పోదిక
close
Published : 28/01/2022 00:47 IST

మడత పోదిక!

దుస్తులన్నీ పొందిగ్గా సర్ది ఉంచుతామా! శ్రీవారు తొందరలో మధ్యలోంచి షర్టు లాగారో.. పైవి చిందరవందరే. పిల్లల్ని పొరబాటున తీసుకోమన్నామా.. మొత్తం దుస్తులన్నింటినీ ఉండ చుట్టేస్తారు. ఇస్త్రీ చేసినవైతే.. మడతలన్నీ పోయి నలిగినట్లు కనిపిస్తాయి. రోజూ ఉండే దానికి వీటిని సర్దడం ఇంకో అదనపు పనవుతుంది. ఈ వర్డ్‌రోబ్‌ ఆర్గనైజర్‌ని ఓసారి చూసేయండి. అరల్లా ఉంటుందింది. షర్టులు, టీషర్టులు, ప్యాంట్‌లు వేటినైనా పెట్టుకోవచ్చు. కావాల్సినదాన్ని సులువుగా తీసేసుకోవచ్చు. పైన, కింది వాటికి ఎలాంటి ఇబ్బందీ ఉండదు. మనకీ ఈ అదనపు పని తగ్గుతుంది. బాగుంది కదూ! ఈకామర్స్‌ వేదికల్లో దొరుకుతున్నాయి. అవసరమనిపిస్తే తెప్పించేసుకోండి మరి!


Advertisement

మరిన్ని