రెండు వారాలసవాల్‌ ఇది!

వంటావార్పూ, బయటికెళ్లి సరకులూ కూరగాయలూ తెచ్చుకోవడం లాంటి పనులు తక్షణం చేసేవి కనుక ఎప్పటికప్పుడు పూర్తయిపోతాయి. వచ్చిన చిక్కల్లా ఇల్లు సర్దుకోవడంతోనే. ఈ సమస్యను దాటేయడానికి ఎవరికి తోచిన

Published : 31 Jan 2022 00:59 IST

వంటావార్పూ, బయటికెళ్లి సరకులూ కూరగాయలూ తెచ్చుకోవడం లాంటి పనులు తక్షణం చేసేవి కనుక ఎప్పటికప్పుడు పూర్తయిపోతాయి. వచ్చిన చిక్కల్లా ఇల్లు సర్దుకోవడంతోనే. ఈ సమస్యను దాటేయడానికి ఎవరికి తోచిన మార్గాలు వాళ్లు ఎంచుకుంటారు. అలాంటివాటిల్లో ‘తక్కువ సామాను, ఎక్కువ శోభ’ సవాలొకటి చాలామంది అమలుచేస్తున్నారు. రెండు వారాల గడువులో అనవసర సామాను తగ్గించడం దీని లక్ష్యం...

నలో చాలామందిమి అవసరం లేకపోయినా ఏవేవో వస్తువులు కొంటాం. ఇక వేరే ఊళ్లకు వెళ్లినప్పుడు చెప్పాల్సిందే లేదు.. అక్కడ ప్రత్యేకం అనిపించినవన్నీ కొనుక్కొస్తాం. ఆపై... కిక్కిరిసిన సరంజామాతో ఇల్లు ఇరుగ్గా, గజిబిజిగా ఉంటుంది. ఈ సమస్య అందరి ఇళ్లల్లో ఉండేదే కనుక అనవసర వస్తువులను కొనడం వల్ల సొమ్ము వృథా అవడమే గాక ఇంటి శోభ తగ్గుతుందని హితవు చెబుతున్నారు ఇంటీరియర్‌ డిజైనర్లు.  భవిష్యత్తులో ఎప్పుడో ఉపయోగపడతాయని వస్తువులను పేర్చుకోవడం కంటే అమ్మేయడం లేదా పేదలకు ఇచ్చేయడం మంచిదంటున్నారు.

* చాన్నాళ్లుగా ఇల్లు సర్దనందున గందరగోళంగా ఉంటే హడావుడిగా పూర్తిచేయాలని కంగారుపడి ఒత్తిడి పెంచుకోవద్దు. రెండు వారాల గడువు నిర్ధారించుకోండి. మీ ఇంట్లో గదులు, అల్మారలు, అటకలు, వార్డ్‌రోబ్‌లు, బీరువాలు.. అన్నీ లెక్కరాసుకుని పనిని విభజించండి. ఒక్కోదానికి కొన్ని గంటలు కేటాయించి ఆ సమయంలో ఆ పని పూర్తయ్యేలా చూడండి. 14 రోజుల్లో ఇల్లంతా అందంగా, ఆకర్షణీయంగా ఉండాలని లక్ష్యం పెట్టుకోండి. అందంగా అమర్చడంతోబాటు కుటుంబసభ్యులు వాడని దుస్తులు, వస్తువులను తొలగించడం మీ లక్ష్యంగా ఉండాలి. ఇంత డబ్బు ఖర్చుపెట్టి కొన్నాం, ఎలా వదులుకోవడం అని సందేహించారంటే ఇక ఇల్లు సత్రంలానే ఉంటుంది మరి. ఆ సొమ్ము వృథా అయ్యిందని గుర్తుంచుకుంటే ఇంకోసారి, మరోసారి అవసరం లేని వస్తువుల జోలికి వెళ్లరు. అలా చూస్తే మీరో పాఠం నేర్చుకున్నట్టేగా! పైగా మీకు అడ్డంగా ఉన్న వస్తువులు ఇంకొకరికి ఉపయోగపడతాయి కూడా.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్