గాలి చొరబడదిక!

పచారీ కొట్టు నుంచి సామన్లు తేగానే ఉప్పూ, పప్పూ, కారం, స్నాక్స్‌... ఇలా దేనికదే విడివిడిగా డబ్బాల్లో పోసి పెట్టుకుంటాం. అయితే ఒక్కోసారి డబ్బా నిండిపోయి కొన్ని మిగిలిపోతాయి. మరి వాటి సంగతేంటి?

Updated : 02 Feb 2022 05:46 IST

చారీ కొట్టు నుంచి సామన్లు తేగానే ఉప్పూ, పప్పూ, కారం, స్నాక్స్‌... ఇలా దేనికదే విడివిడిగా డబ్బాల్లో పోసి పెట్టుకుంటాం. అయితే ఒక్కోసారి డబ్బా నిండిపోయి కొన్ని మిగిలిపోతాయి. మరి వాటి సంగతేంటి? ఇలా మిగిలిపోయిన పదార్థాలను అదే బ్యాగులో జాగ్రత్తగా తిరిగి ప్యాక్‌ చేయొచ్చు. ‘మినీ హీట్‌ సీలింగ్‌ మిషన్‌’గా పిలిచే దీంతో ప్లాస్టిక్‌ సంచులను ఎంచక్కా రీసీల్‌ చేయొచ్చు.  

సీల్‌ చేయాలనుకున్న కవర్‌ నుంచి మొత్తం గాలి బయటకు పంపేసి చివర్లను మడతపెట్టి ఈ పరికరం మధ్యలో పెట్టి గట్టిగా నొక్కాలి. రెండో వైపు కూడా చేస్తే దానిలోని వేడికి మూసుకు పోతుంది. అందులోని పదార్థం తాజాగా నిల్వ ఉంటుంది. బ్యాటరీతో నడిచే దీంతో ప్రయాణాల్లో సౌందర్య సాధనాలనూ ప్యాక్‌ చేసుకోవచ్చు. దీని అడుగున ఉండే అయస్కాంతం సాయంతో ఫ్రిజ్‌, అల్మారా... లాంటివాటికి అతికించొచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్