ఇల్లాలి కోసం...వంటింటి చిట్కాలు

చలికాలం మిగతా కాలాలతో పోలిస్తే కాస్త బద్ధకంగా అనిపిస్తుంది. మరికాసేపు ముసుగుతన్ని నిద్రపోతే బాగుండుననిపిస్తుంది.  ముఖ్యంగా గృహిణులు ఉదయాన్నే చలిలో లేచి వంట పనులు మొదలుపెట్టాలంటే కాస్త కష్టమే... ఈ కాలంలో చలికి చేతులు వంకర్లు పోతాయి.

Published : 03 Feb 2022 01:50 IST

చలికాలం మిగతా కాలాలతో పోలిస్తే కాస్త బద్ధకంగా అనిపిస్తుంది. మరికాసేపు ముసుగుతన్ని నిద్రపోతే బాగుండుననిపిస్తుంది.  ముఖ్యంగా గృహిణులు ఉదయాన్నే చలిలో లేచి వంట పనులు మొదలుపెట్టాలంటే కాస్త కష్టమే... ఈ కాలంలో చలికి చేతులు వంకర్లు పోతాయి. కాబట్టి పనులను కొంచెం సులువుగా ఎలా చేసుకోవాలో చూద్దామా...
* ఉడికించిన బంగాళా దుంపల పొట్టు తీయాలంటే ఒక్కోసారి ఓ పట్టాన రాదు. ఇలాంటప్పుడు దుంపలను ఉడికించే ముందు వాటికి ఫోర్క్‌తో గాట్లు పెట్టండి. ఇలా చేస్తే సాధారణంగా ఉడికే సమయానికంటే ముందే ఉడికిపోతాయి. పొట్టూ సులువుగా వచ్చేస్తుంది. చేతులూ నొప్పెట్టవు. అంతేకాదు గ్యాస్‌, సమయం రెండూ ఆదా అవుతాయి.
* వెల్లుల్లి, ఉల్లిపొట్టు తీయాలంటే ఈ కాలంలో కాస్త ఇబ్బందిగానే అనిపిస్తుంది. అలా కాకుండా ఉండాలంటే ఈ చిట్కా వాడి చూడండి. వేడి నీళ్లలో వీటిని కాసేపు వేసి ఆ తర్వాత పొట్టు తీయండి. ఇలా చేస్తే పొట్టు సులువుగా వస్తుంది. మీ చేతులకూ వెచ్చదనం అందుతుంది.
*  కూరల్లో వేసుకునే వెజిటేబుల్‌ మసాలను ముందే తయారుచేసి పెట్టుకుంటే మీకు చాలా సమయం ఆదా అవుతుంది. ఇలా చేస్తే రోజూ కూర వండే సమయంలో దినుసులను వేయించడం, చల్లార్చి పొడి చేసుకోవడం లాంటి ఇబ్బంది తప్పుతుంది. కాబట్టి మీకు సమయం ఉన్నప్పుడు  పది-పదిహేను రోజులకు కావాల్సిన మసాలాను సిద్ధం చేసుకుని పెట్టుకోండి. ఇందుకోసం...టొమాటోలు- నాలుగైదు, ఉల్లిపాయలు- నాలుగు, పచ్చిమిర్చీ- నాలుగు, వెల్లుల్లి రెబ్బలు- పన్నెండు, అల్లం ముక్క- కాస్త పెద్దది, ఎండు మిర్చీ- రెండు (కావాలనుకుంటే..) ముందుగా వీటన్నింటినీ గ్రైండ్‌ చేసుకోవాలి. పాన్‌లో కాస్త నూనె ఎక్కువగానే వేసి, ఈ మిశ్రమం వేసుకుని దాదాపు 20 నుంచి 25 నిమిషాలు వేయించాలి. కావాలనుకుంటే ఎర్ర మిర్చీని వేసుకోవచ్చు. ఈ మిశ్రమాన్ని చల్లార్చి డబ్బాలో వేసి ఫ్రిజ్‌లో పెట్టుకుని వాడుకోవచ్చు.
* పాలు పొయ్యి మీద పెట్టి మర్చిపోతుంటాం. చాలాసార్లు అవి పొంగి స్టవ్‌ మొత్తం అవుతుంటాయి. అలా కాకుండా ఉండాలంటే పాల గిన్నె మీద ఓ చెక్క చెంచాను ఉంచండి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్