Updated : 27/02/2022 05:36 IST

పుల్లటి పెరుగు... కమ్మటి రుచి!

ఎన్ని కూరలున్నా... చివరి ముద్ద పెరుగుతో తింటే అదో సంతృప్తి. అయితే ఈ పెరుగు అప్పుడప్పుడూ పులుపెక్కుతుంది. దాన్నేం చేద్దాం...

ఢోక్లా సరిగా పొంగడం లేదా... కావాల్సిన పదార్థాలు కలిపే సమయంలో పుల్లటి పెరుగు, సెనగపిండిని 2:1 నిష్పత్తిలో కలపండి. చక్కగా పొంగడమే కాకుండా అద్భుతమైన రుచి.

ఇళ్లలో రోటి పచ్చళ్లు సర్వసాధారణం. పచ్చిమిర్చి, వెల్లుల్లి మిశ్రమానికి కాస్త పుల్లని పెరుగూ జత చేయండి. ఆహా అనిపించే చట్నీ సిద్ధం. అయితే పెరుగు మరీ పలుచగా/చిక్కగా ఉండకుండా చూసుకోవాలి.

దోశలకు నానబెట్టిన బియ్యంలో కాస్త పుల్లటి పెరుగు, కాసిన్ని మెంతులు వేసి మూడు గంటలు పక్కన పెట్టండి. రుబ్బాక... మరికాస్త పెరుగు జత చేస్తే.. దోశలు కరకరలాడుతూ మరింత రుచిగా వస్తాయి.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని