వార్డ్‌రోబ్‌పై ఓ కన్నేయండి

కాలేజీకి ఆలస్యమవుతోందన్న కంగారులో చేతికి దొరికిన దుస్తులనే వేసేసుకుంటాం. దాంతో గతంలో కొనుక్కున్నవేవీ  గుర్తుండవు. అడుగునున్నవి అలానే ఉండిపోతాయి. దీంతో దుస్తులన్నీ పాతబడ్డాయని కొత్తవి కొంటుంటాం. వార్డ్‌రోబేమో ఇరుకైపోతుంది.

Published : 14 Mar 2022 01:52 IST

కాలేజీకి ఆలస్యమవుతోందన్న కంగారులో చేతికి దొరికిన దుస్తులనే వేసేసుకుంటాం. దాంతో గతంలో కొనుక్కున్నవేవీ  గుర్తుండవు. అడుగునున్నవి అలానే ఉండిపోతాయి. దీంతో దుస్తులన్నీ పాతబడ్డాయని కొత్తవి కొంటుంటాం. వార్డ్‌రోబేమో ఇరుకైపోతుంది. అలాంటప్పుడేం చేయాలంటే...

ఎంతో నచ్చి కొన్నా.. వేయకుండా బీరువాల్లో ఉంచే దుస్తుల విలువ ఏడాదికి సగటున రూ.23వేలకు పైనేనట! వృథా అవుతున్న దుస్తులపై తాజాగా స్టిచ్‌ ఫిక్స్‌, యునైటెడ్‌ కింగ్‌డమ్‌ ఆధ్వర్యంలో రెండు వేలమంది యువతపై అధ్యయనం జరిపారు. దాదాపు పాతిక శాతం మంది ఏడాది గడిచినా కొన్ని దుస్తులను వినియోగించలేదట. ఇంకొంతమంది తాము కొనుగోలు చేసిన ప్రతిదాన్నీ ధరించినట్లు చెప్పగా, మరికొందరు మాత్రం ఇష్టపడి కొన్నా.. వాటిలో కొన్నింటినే ఎక్కువసార్లు వేసుకుంటున్నట్లు చెప్పారు. 65 శాతం మంది ట్యాగ్స్‌ కూడా తొలగించకుండా భద్రపరిచారట.

కంటికి కనిపించేలా.. వార్డ్‌రోబ్‌పై అవగాహన ఏర్పరచుకోవాలి. అన్నింటినీ ఇరికించేయొద్దు. అడుగునవి అలాగే ఉండిపోవడమే కాదు.. అసలెన్ని దుస్తులున్నాయో కూడా గుర్తుండదు. దీంతో కొన్నింటిని వినియోగించడమే మానేస్తాం. కాబట్టి, రంగులు వెలిసిన, పాతవాటిని ఏదైనా ఒక అట్టపెట్టెలో సర్దిపెట్టి, అవసరమైనవారికి ఇచ్చేయాలి. దాంతో వార్డ్‌రోబ్‌ ఖాళీగా అవడమే కాకుండా, అవసరమైనవి మాత్రమే మిగులుతాయి. అసలెన్ని రకాల వస్త్రాలున్నాయో కూడా తెలుస్తుంది.

సర్దుకోవాలిలా.. హ్యాంగర్స్‌ తప్పక ఏర్పాటు చేసుకోవాలి. చొక్కాలు, షార్ట్‌ టాప్స్‌ వంటివి వాటికి తగిలించొచ్చు. మూలగా ఓ అట్టపెట్టెలో లోదుస్తులను ఉంచాలి. అవసరానికి వెంటనే చేతికి అందుతాయి. దుపట్టాలకూ ప్రత్యేక హ్యాంగర్లు దొరుకుతున్నాయి. వాటికి తగిలిస్తే హడావుడిలోనూ మ్యాచింగ్‌వి క్షణాల్లో ఎంచుకోవచ్చు. లెగ్గింగ్స్‌, ప్యాంటులను విడివిడిగా ఉంచితే రంగులను ఎంచుకోవడం తేలికవుతుంది. లాంగ్‌ టాప్స్‌లో సిల్కు, కాటన్‌.. ఇలా విడదీసుకొని, ప్రతిరోజూ ధరించేవి ఎదురుగా ఉంచాలి. చీరలకు ప్రత్యేక అరను ఎంచుకుంటే మంచిది. అలాగే కాస్త ఖరీదెక్కువైన దుస్తులకు ఒక అర కేటాయిస్తే వివాహాది శుభకార్యాలకు, పార్టీలకు తేలిగ్గా తీ సుకోవచ్చు. బీడ్స్‌ వర్క్‌, పట్టు వంటి దుస్తులను కాటన్‌ కవర్లలో భద్రపరిస్తే ఎక్కువరోజులు పాడవకుండా ఉంటాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్