ఎండల్లోనూ పచ్చగా

ఎండాకాలం వచ్చిందంటే మనం ఇష్టంగా పెంచుకున్న మొక్కలకి అగ్నిపరీక్ష కిందే లెక్క. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. వేడికి ఎండిపోతుంటాయి. అలాకాకుండా ఉండాలంటే తోటపెంపకంలో ఈ

Published : 24 Mar 2022 01:37 IST

ఎండాకాలం వచ్చిందంటే మనం ఇష్టంగా పెంచుకున్న మొక్కలకి అగ్నిపరీక్ష కిందే లెక్క. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. వేడికి ఎండిపోతుంటాయి. అలాకాకుండా ఉండాలంటే తోటపెంపకంలో ఈ కాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటో చూద్దాం..

* మొక్కలు ఎండిపోకుండా ఉండాలంటే మట్టిలో తేమ పుష్కలంగా ఉండేట్టు జాగ్రత్త పడాలి. అలా ఉండాలంటే బాగా పొద్దునే.. మళ్లీ సూర్యాస్తమయం అయ్యాక నీళ్లు పోయాలి. అలాగే పోసిన నీళ్లు త్వరగా ఆవిరి కాకుండా.. మొక్క మొదల్లో చెక్కపొట్టుకానీ, కాగితాలనుగానీ ఉంచండి. ఇలా చేస్తే లోపల మట్టి తేమని కోల్పోకుండా ఉంటుంది.

* సకులెంట్‌, జేడ్‌లాంటి మొక్కలని చిన్నకుండీల్లో పెంచుతుంటాం. వీటికి ఎక్కువ నీళ్లు పోయలేం. అలాగని వేడికి వదిలేయలేం. అలాంటప్పుడు సొంతంగా హ్యుమిడిటీ ట్రేలను చేసుకోవచ్చు. ఒక ట్రేలో కొన్ని పెబల్స్‌ లేదా గులకరాళ్లని వేసి ఆ ట్రే నిండేవరకూ నీళ్లు పోయండి. అందులో మీక్కావాల్సిన కుండీలని ఉంచండి. మొక్కలు వేడికి చచ్చిపోయే ప్రమాదం ఉండదు.

* వీలుంటే పొద్దున పూట మొక్కలని ఎండలో ఉంచి ఆ తర్వాత నీడపట్టుకు తెచ్చుకుంటే మంచిది.

* మీ ఇంటి ఏసీ యూనిట్ల దగ్గర మొక్కలని ఉంచొద్దు. వాటిల్లోంచి వచ్చే వేడి మొక్కల ఎదుగుదలని అడ్డుకుంటుంది.

* ఎక్కువ మొక్కలు ఉంటే బజార్లో దొరికే షేడ్‌నెట్‌ లేదా గ్రీన్‌నెట్‌లని వేయండి. ఇవి ఎండ, వేడి తీవ్రతని సగానికి తగ్గించి మొక్కలని కాపాడతాయి.

* కొన్ని మొక్కలు వేసవిలోనే వేగంగా ఎదుగుతాయి. అందుకే మొక్కల్లో ఎండిన భాగాలుంటే కత్తిరించేసి, కలుపుంటే తీసేయండి. బోన్‌మీల్‌, వర్మీకంపోస్ట్‌లాంటివి తగుమోతాదులో అందించండి. ఎప్సమ్‌సాల్ట్‌ కలిపిన నీళ్లను మొక్కలపై చిలకరిస్తే అవి ఆరోగ్యంగా ఎదుగుతాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్