ఈ పండుగ వేళ...

ఇంటిని ఆకర్షణీయంగా తీర్చిదిద్దుకోవడం పెద్ద పనేమీ కాదు. కొద్ది శ్రమతోనే కొత్త ఆకర్షణలను తేవొచ్చు. తెలుగు నూతన సంవత్సరం వచ్చేస్తోంది... మరి మీ దగ్గర ఉండే వాటితోనే ఇంటిని మరింత అందంగా

Updated : 26 Mar 2022 03:31 IST

ఇంటిని ఆకర్షణీయంగా తీర్చిదిద్దుకోవడం పెద్ద పనేమీ కాదు. కొద్ది శ్రమతోనే కొత్త ఆకర్షణలను తేవొచ్చు. తెలుగు నూతన సంవత్సరం వచ్చేస్తోంది... మరి మీ దగ్గర ఉండే వాటితోనే ఇంటిని మరింత అందంగా మార్చేసుకోవచ్చంటున్నారు ఇంటీరియర్‌ డిజైనర్లు. అవేంటో తెలుసుకుందామా...

మెరిసేలా... బీరువాలో వాడకుండా ఉన్న ముదురు వర్ణంలో మెరిసే పాత ఫ్యాన్సీ లేదా సిల్కు దుపట్టాలు, చీరలను తీసిపెట్టుకోవాలి. ముందుగది లేదా హాల్‌ గోడలకు మ్యాచింగ్‌గా ఉండే వాటిని ఎంచుకోవాలి. ఆ తర్వాత వీటితో సోఫా సీటు, తలగడలకు కవర్లుగా కుట్టి, వేసి చూడండి. సీట్స్‌, పిల్లోస్‌కు కాంట్రాస్ట్‌గా రంగులను ఎంచుకుంటే మరింత ఆకర్షణీయంగా కనిపిస్తాయి. ఆ ప్రాంతమంతా కొత్తదనం పరుచుకున్నట్లుగా మారిపోతుంది.

పరదాలుగా... వాడని సిల్కు దుపట్టాలన్నింటినీ కలిపి వర్ణభరితమైన పరదాలుగా మార్చేయొచ్చు. కిటికీలు, గుమ్మాలకు వీటిని తగిలిస్తే చాలు. పడకగదికి లేత వర్ణాలు, హాలు, భోజన గదికి ముదురు వర్ణాల్లో ఉండేలా ఎంచుకుంటే ఆ గదులు ప్రత్యేకంగా కనిపిస్తాయి. గదుల మధ్య సువాసనభరితమైన కొవ్వొత్తులు వెలిగిస్తే ఇల్లంతా పరిమళాలు వెదజల్లుతుంటాయి.

జాడీలతో... పనికి రాని పచ్చడి జాడీలు, ఇత్తడి గిన్నెలుంటే వాటినీ ఇంటి అలంకరణలో భాగం చేయొచ్చు. ముందుగా వాటిని మెరిసేలా  శుభ్రంగా కడగాలి. ఆ తర్వాత చామంతి, బంతి, గులాబీ వంటి సహజమైన పూలతో నింపి గదిమూల లేదా టీపాయ్‌పై సర్దితే చాలు. సంతోష సంరంభాలకు స్వాగతం పలికేలా ఇల్లంతా కళకళలాడటమే కాదు. మనసంతా ఉత్సాహంతో నిండిపోతుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్