రంగులు చెప్పేస్తాయి!

ఆహార పొట్లాలు, డబ్బాలపై ఎరుపు, ఆకుపచ్చ, పసుపు రంగుల్లో గుండ్రటి, చతురస్రాకార గుర్తులుంటాయి.. ఈ సంకేతాలకు రకరకాల అర్థాలు ఉన్నాయని తెలుసా...

Published : 29 Mar 2022 01:17 IST

ఆహార పొట్లాలు, డబ్బాలపై ఎరుపు, ఆకుపచ్చ, పసుపు రంగుల్లో గుండ్రటి, చతురస్రాకార గుర్తులుంటాయి.. ఈ సంకేతాలకు రకరకాల అర్థాలు ఉన్నాయని తెలుసా...

ఆకుపచ్చ... పూర్తిగా శాకాహారంతో తయారైందని అర్థం.  

ఎరుపు... కొద్ది మొత్తంలో మాంస సంబంధిత పదార్థాలు కలిపితే ఆ ఉత్పత్తి డబ్బా మీద ఎర్రటి చుక్క అగుపిస్తుంది. ఇది చతురస్రాకారంలోనూ ఉండొచ్చు.

పసుపు... కొందరు శాకాహారులు గుడ్డు తింటారు. మరికొందరు అస్సలు ముట్టుకోరు. అలాంటి వారు ఆహార పొట్లాలు, డబ్బాల పై ఈ పసుపు రంగు గుర్తు ఉందో లేదో చూసుకోవాలి. పసుపు రంగు చుక్క ఉంటే అందులో గుడ్డును కలిపారని సంకేతం.

నీలం... అతికొద్ది మొత్తంలో చక్కెర కలిపితే నీలం రంగు చుక్కతో చూపిస్తారు. ఈ ఆహారాన్ని వైద్యుల సూచనల మేరకు మధుమేహులు తీసుకోవచ్చు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్