నిచ్చెనలతో మెప్పిద్దామా!

అద్దె ఇల్లు అయినా... సొంతిల్లయినా చూడగానే ఆకట్టుకునేలా ఉండాలి. తక్కువ స్థలం ఉన్నప్పుడు నిచ్చెనలతో ఆ ప్రదేశానికి ఓ కొత్త ఆకర్షణను తీసుకురావొచ్చు. అదెలాగంటే...

Updated : 30 Mar 2022 03:52 IST

అద్దె ఇల్లు అయినా... సొంతిల్లయినా చూడగానే ఆకట్టుకునేలా ఉండాలి. తక్కువ స్థలం ఉన్నప్పుడు నిచ్చెనలతో ఆ ప్రదేశానికి ఓ కొత్త ఆకర్షణను తీసుకురావొచ్చు. అదెలాగంటే...

* బాల్కనీల్లో ఎక్కువ మొక్కల్ని పెంచాలనే తాపత్రయంతో లెక్కకు మించి పెట్టేస్తుంటారు చాలామంది. కానీ అలా చేస్తే ఒకదానిపై ఒకటి పడి... చూడ్డానికీ బాగోవు. ఏదైనా ఒక దానికి సమస్య వస్తే అన్నింటికీ పాకే ప్రమాదమూ ఉంది. అందుకే ఓ నిచ్చెన ఏర్పాటు చేసి కొన్నింటిని దానిపై ఉంచితే చాలా బాగుంటుంది. తీగలు లతలూ అల్లించినా బాగుంటుంది.
* పాత నాలుగు కాళ్ల నిచ్చెన మెట్లపై పీవీసీ షీట్‌ అతికించండి. పాలిష్‌ చేసి దాన్ని హాల్లో ఓ మూలగా నిలబెట్టండి. ఇందులో పుస్తకాలూ, అలంకరణ వస్తువులు పెట్టవచ్చు.  
* తువాళ్లు, సబ్బులూ, బాడీ లోషన్లు వంటి సౌందర్య ఉత్పత్తులన్నీ విడివిడిగా పెడుతున్నారా? అన్నీ సులువుగా తీసుకునేలా ఉండాలనుకుంటే... మెట్టు మెట్టుకీ ఒక రంగు బుట్టని వేలాడదీయండి. ఒక్కోదానిలో ఒక్కోదాన్ని పెట్టేయండి. దీన్ని స్నానాలగదికి దగ్గర్లో పెట్టుకుంటే సౌకర్యం కూడా.
* నిచ్చెనకు బ్రైట్‌ కలర్‌ వేసి దానికి పూల కుండీలే వేలాడదీయండి. లేదా అలంకరణ వస్తువులు పెట్టి... సీరియల్‌ దీపాల తీగను చుట్టేయండి. దీన్ని ఆ ప్రదేశానికి ఓ పక్కగా పెట్టినా...అందరి చూపూ తిప్పుకోనివ్వదు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్