‘అమ్మ మనసు’ దీని పేరు!

ఇంట్లో అమ్మ ఉన్నంతసేపూ మనమే సమయంలో ఇంటికి వెళ్లినా వేడివేడిగా పొగలు కక్కే అన్నానికీ, రుచికరమైన కూరలకి కొరత ఉండదు కదా! సమయానికి అమ్మలేకపోయినా ఆమెలా ఆలోచించి.

Published : 21 Apr 2022 01:28 IST

ఇంట్లో అమ్మ ఉన్నంతసేపూ మనమే సమయంలో ఇంటికి వెళ్లినా వేడివేడిగా పొగలు కక్కే అన్నానికీ, రుచికరమైన కూరలకి కొరత ఉండదు కదా! సమయానికి అమ్మలేకపోయినా ఆమెలా ఆలోచించి... ఇంటికి వెళ్లీవెళ్లగానే వేడివేడి అన్నం వడ్డించేవాళ్లు ఉంటే? ఈ ఆలోచన ఎప్పుడైనా వచ్చిందా మీకు. వస్తే ఈ ‘మదర్స్‌ హార్ట్‌’ పరికరాన్ని తెచ్చుకుని ఇంట్లో పెట్టుకోవడమే! వడ్డించిన ఆరు గంటల తర్వాత కూడా అన్నం, కూరలు... ఇతర ఆహారపదార్థాలని అప్పుడే పళ్లెంలో పెట్టినంత తాజాగా ఉంచుతుందీ పరికరం. వాటిల్లో పోషకాలు ఏమాత్రం తరిగిపోకుండా చూస్తుంది. కొరియాలో అన్నం, కూరలపై ‘శాంగ్‌బో’ అనే వస్త్రాన్ని కప్పుతారు. ఈ వస్త్రం వేసవి కాలం కూరలు చెడిపోకుండా చూస్తుంది. శీతాకాలం వంటకాలు చల్లారిపోకుండా కాపాడుతుంది. ఈ వస్త్రం ఇచ్చిన స్ఫూర్తితోనే ఈ మదర్స్‌ హార్ట్‌ పరికరాన్ని కనిపెట్టామంటున్నారు తయారీదారులు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్