పొదుపు మంత్రం జపించండి!

పెళ్లి తర్వాత బాధ్యతలతోపాటు ఖర్చులూ పెరుగుతాయి. వాటికి కళ్లెం వేయాలంటే భాగస్వామి సాయం తీసుకోవాల్సిందే. ఇద్దరూ కలిసి పొదుపు మంత్రం జపిస్తే భవిష్యత్తులో ఆర్థిక ఇబ్బందులు ఎదురుకావు. అందుకు తోడ్పడే సూచనలివి..

Updated : 23 Apr 2022 06:32 IST

పెళ్లి తర్వాత బాధ్యతలతోపాటు ఖర్చులూ పెరుగుతాయి. వాటికి కళ్లెం వేయాలంటే భాగస్వామి సాయం తీసుకోవాల్సిందే. ఇద్దరూ కలిసి పొదుపు మంత్రం జపిస్తే భవిష్యత్తులో ఆర్థిక ఇబ్బందులు ఎదురుకావు. అందుకు తోడ్పడే సూచనలివి..

భార్యభర్తలిద్దరూ డబ్బు పొదుపు చేయాలని నిర్ణయించుకున్నప్పుడు ఆ విషయంలో పారదర్శకతను పాటించాలి. చాలామంది తమ ఆదాయం, ఖర్చుల గురించి ఎదుటి వారికి చెప్పాలనుకోరు. ‘ఇంత ఖర్చు పెడుతున్నావా? ఇంతే ఆదాయం వస్తుందా’ అనే ప్రశ్నలను ఎదుర్కోవాల్సి వస్తుందని. కానీ ఇది సరైన పద్ధతి కాదు. భార్యాభర్తలిద్దరూ ఉద్యోగస్తులైతే ఇద్దరి సంపాదనా, ఖర్చు ఒకరికొకరికి తెలుసుండాలి. అందుకోసం ఓ పుస్తకం పెట్టుకోవడమో, యాప్‌లో నమోదు చేయడమో చేయాలి. అవసరాలు, అనవసర ఖర్చులు, పచారీ సామాన్లు, విందులు, వినోదాలు... ఇవన్నీ పక్కాగా లెక్క వేసినప్పుడు మాత్రమే మీరు పొదుపు చేయగలుగుతారు.

కొంత పక్కన... మీ మొదటి పొదుపు మంత్రం ఏమిటంటే... సంపాదించిన మొత్తంలో నుంచి కొంత పక్కన పెట్టడమే. అది భవిష్యత్తు అవసరాలకు అత్యవసర నిధిలా ఆదుకుంటుంది.

ఇద్దరికీ... ఒకటే ఖాతా... జంటగా పొదుపు అలవాట్లను పెంపొందించుకోవాలనుకుంటే... ఉమ్మడి ఖాతాను తెరవాల్సిందే. ఇద్దరూ కలిసి ప్రతి నెలా కొంత జమ చేయాలి. ఏదైనా అవసరం ఉన్నప్పుడు ఇద్దరూ విత్‌డ్రా చేసుకోవచ్చు. దీనికి ఇద్దరి సంతకాలూ అవసరం కూడా. ఒకరు కార్డు వాడితే రెండో వ్యక్తికి తెలుస్తుంది. దీంతో ఇద్దరూ డబ్బు విషయంలో అప్రమత్తంగా ఉంటారు. ఇది క్రమంగా పొదుపునకు దారి తీస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్