పిల్లల బుట్ట తోట...

ముందు గది లేదా పడకగదిలో ఓ వెదురుబుట్టలో చిన్న తోటను ఎప్పుడైనా పెంచారా. చిన్నారుల ఊహకు తగినట్లుగా వారి కలల ప్రపంచాన్ని ఓ తోటగా తీర్చిదిద్ది చూపించండి.

Updated : 27 Apr 2022 04:19 IST

ముందు గది లేదా పడకగదిలో ఓ వెదురుబుట్టలో చిన్న తోటను ఎప్పుడైనా పెంచారా. చిన్నారుల ఊహకు తగినట్లుగా వారి కలల ప్రపంచాన్ని ఓ తోటగా తీర్చిదిద్ది చూపించండి.

ఇంట్లో  పండ్ల బుట్ట  వృథాగా ఉంటే దాన్ని చిన్న తోటగా మార్చేయొచ్చు. ముందుగా గడ్డి, నాచు మొక్కలు, చిన్న చిన్న ఇండోర్‌ మొక్కలను సిద్ధం చేసుకోవాలి. పదిహేను ఐస్‌క్రీం పుల్లలను చిన్న ఫెన్సింగ్‌గా వరుసగా అంటించాలి. వృథా అట్ట ముక్కలతో రెండు మూడు పక్షి గూళ్లు చేయాలి.  బుట్ట అడుగుభాగాన చిన్న ప్లాస్టిక్‌ సంచి పరిచి, ఆపై మట్టి నింపాలి. ముందుగా సిద్ధం చేసిన గడ్డిని మట్టిపై పరవాలి. బుట్ట ఓ వైపున అంచుల్లోకి ఐస్‌క్రీం పుల్లలతో చేసిన ఫెన్సింగ్‌ను గుచ్చాలి. పక్కన చిన్న చెక్క తో చేసిన బెంచీ, దానిపై పిల్లల బొమ్మలుంచాలి. మరోవైపు ఇండోర్‌ మొక్కలను పాతాలి. చిన్న పుల్లలకు బర్డ్స్‌ నెస్ట్‌లు గుచ్చి గడ్డిలో నిలబెట్టాలి. కొంచెం నీటిని చిలకరించి నీడలో ఉంచితే, పది రోజుల్లోపు గడ్డి పూర్తిగా చిగురిస్తుంది. పిల్లల సృజనాత్మకత మేరకు ఇలా మినియేచర్‌ తోటను తయారు చేయిస్తే చాలు. పరమానంద భరితులవుతారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్