తడిగా ఉంటే.. నీళ్లు పోయొద్దు!

మొక్కలు పెంచాలనుకుంటున్నారా... అయితే కొన్ని పొరపాట్లను చేయకండి. వాటి వల్ల మొక్కకు హాని జరగొచ్చు. మరి ఏం జాగ్రత్తలు తీసుకోవాలో చూడండి.

Published : 29 Apr 2022 01:47 IST

మొక్కలు పెంచాలనుకుంటున్నారా... అయితే కొన్ని పొరపాట్లను చేయకండి. వాటి వల్ల మొక్కకు హాని జరగొచ్చు. మరి ఏం జాగ్రత్తలు తీసుకోవాలో చూడండి.

ఎరువులు...  ఎక్కువ మొత్తంలో ఎరువులు వేస్తే మొక్కలు బాగా పెరుగుతాయనుకోవడం నిజం కాదు. ఇలా చేస్తే మొక్కలు బాగా పెరగవు. మొక్కలు తమకు కావాల్సినంత మాత్రమే పోషకాలను గ్రహిస్తాయి. కాబట్టి తగినంత మోతాదులోనే ఎరువులను వేయాలి.

రసాయన ఎరువులు...  వీటి వల్ల మొక్కలకు మేలు కంటే హానే ఎక్కువ. అందుకే వంటింటి వ్యర్థాలతో సేంద్రియ ఎరువులను తయారు చేసుకోవాలి.

నీడ... స్థలాభావం, ఇతర కారణాలతోనైనా మొక్కలను నీడ పట్టున నాటితే సరిగా ఎదగవు. చిక్కుడు లాంటి వాటికి కాస్త వెలుతురు ఉన్నా సరిపోతుంది. మిగతావాటికి మాత్రం ధారాళంగా వెలుతురు కావాల్సిందే.

మట్టి... మొక్క ఆరోగ్యంగా పెరగడానికి పోషకభరిత నేల కూడా అవసరమే. కాబట్టి నాటే ముందు మట్టిలో సేంద్రియ ఎరువులు, పోషకాలను కలపాలి. అప్పుడే ఏపుగా పెరుగుతుంది.

నీరు... ఎక్కువ నీటిని పోస్తే వేళ్లు కుళ్లిపోతాయి. మట్టి తేమగా మారితే చాలు. నిలిచి ఉండేంత నీరు పోయొద్దు. కొన్ని మొక్కలకు వారం, మరికొన్నింటికి రెండు మూడు రోజులకొకసారి పోసినా సరిపోతుంది. మట్టిలో చేతివేళ్లను ఒకట్రెండు అంగుళాల లోపలికి పెట్టి చూడండి. తేమగా ఉంటే ఆ రోజు నీళ్లు పోయాల్సిన అవసరం లేదు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్