నిమ్మను నిల్వ చేద్దామిలా!

విటమిన్‌ -సితో నిండి ఉండే నిమ్మ ఆరోగ్యానికెంతో మేలు. వంటకాల్లోనూ దీని వినియోగం ఎక్కువే. అయితే దీన్ని నిల్వ చేయడంలో పొరపాట్ల వల్ల త్వరగా ఎండిపోవడమో, పాడవడమో జరుగుతుంది.

Published : 05 May 2022 01:49 IST

విటమిన్‌ -సితో నిండి ఉండే నిమ్మ ఆరోగ్యానికెంతో మేలు. వంటకాల్లోనూ దీని వినియోగం ఎక్కువే. అయితే దీన్ని నిల్వ చేయడంలో పొరపాట్ల వల్ల త్వరగా ఎండిపోవడమో, పాడవడమో జరుగుతుంది. అలా కాకుండా ఉండాలంటే..

నిమ్మకాయలను కోయకుండా అలాగే కొన్నిరోజులు నిల్వ చేయొచ్చు. ఫ్రిజ్‌లో లేదా బయట తడి వస్త్రంలో పెడితే చాలాకాలంపాటు తాజాగా ఉంటాయి. స్లైస్‌లుగా చేసి గాలి చొరబడని డబ్బాల్లో వేసి ఫ్రిజ్‌లో పెడితే ఎక్కువ రోజులుంటాయి. నిమ్మరసాన్ని పిండి సీసాలో పోసి ఫ్రిజ్‌లో పెట్టేయండి లేదా ఐస్‌క్యూబ్స్‌గా మార్చేస్తే చాలా కాలం వాడుకోవచ్చు.

నెలరోజులు.. గాలిచొరబడని ప్లాస్టిక్‌/గాజు సీసాలో నీళ్లు పోసి అందులో నిమ్మకాయలు వేసి మూతపెట్టి ఫ్రిజ్‌లో భద్రపరిస్తే నెలపాటు తాజాగా ఉంటాయి. స్లైస్‌ల నుంచి విత్తనాలను తీసేసి ట్రేలో వేసి వాటిపై నుంచి టిష్యూ కప్పాలి. దీన్ని ఫ్రీజర్‌లో అర గంట పెట్టి ఆ తర్వాత జిప్‌లాక్‌ బ్యాగ్‌లో పెట్టి ఫ్రిజ్‌లో పెడితే సరిపోతుంది. ఇలా దాదాపు నెలపాటు తాజాగా ఉంటాయి.

మూడు నెలలు...  నిమ్మకాయల్ని ఎక్కువ కాలం నిల్వ చేయడమూ  సులువు. ఫ్రీజ్‌ చేసేస్తే సరి. జిప్‌ లాక్‌ బ్యాగులో నిమ్మకాయలను వేసి ఫ్రీజర్‌లో పెట్టేయండి. అయితే ఆ బ్యాగుకు చిన్న రంధ్రం చేయడం మరవొద్దు. దీని ద్వారానే అధిక తేమ, గాలి బయటకుపోయి కాయలు తాజాగా ఉంటాయి. వాడాలనుకున్నప్పుడు తీసి గది ఉష్ణోగ్రతకు వచ్చేవరకు కాసేపు బయట పెడితేసరి. ఫ్రిజ్‌లో నుంచి తీసి నేరుగా వాడొద్దు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్