ఖరీదు కాదు.. కళాత్మకత ముఖ్యం

ఎంత ఖరీదైన ఇల్లు అనే దానికంటే దాన్ని ఎంత బాగా అమర్చుకున్నాం అన్నదే ముఖ్యం. కొందరి ఇళ్లు ఖరీదైన వస్తువుల్లేకుండా కూడా ముచ్చటగా ఉంటాయి. ఇంత అందంగా ఎలా అమర్చారా అని ఆశ్చర్యం కలుగుతుంది.

Published : 09 May 2022 00:56 IST

ఎంత ఖరీదైన ఇల్లు అనే దానికంటే దాన్ని ఎంత బాగా అమర్చుకున్నాం అన్నదే ముఖ్యం. కొందరి ఇళ్లు ఖరీదైన వస్తువుల్లేకుండా కూడా ముచ్చటగా ఉంటాయి. ఇంత అందంగా ఎలా అమర్చారా అని ఆశ్చర్యం కలుగుతుంది. అందుకు గొప్ప నైపుణ్యాలేమీ అక్కర్లేదు. కాస్తంత కళాత్మకత ఉంటే చాలు. ఈ విషయంలో ఇంటీరియర్‌ డిజైనర్ల సూచనలు చూడండి... నచ్చితే పాటించేయండి.

పత్రికలూ టీవీల్లో ఇంటీరియర్‌ కాలమ్స్‌ రెగ్యులర్‌గా చూడండి. బోలెడు విషయాలు చెబుతారు. వాటిలో ఎక్కువ డబ్బు వెచ్చించాల్సిన అవసరం లేదు, సులువే అనుకున్నవి అమలు చేయండి.

అందంలో రంగుల పాత్ర పెద్దది. వస్తువులు, గోడలు, సోఫాలు, కర్టెన్లు- ఏవైనా బాగా కనిపించేది వాటి రంగులను బట్టే. కనుక కొనేటప్పుడు హృద్యంగా ఉండే రంగులను ఎంచుకోండి. అవే పెద్ద ఆకర్షణ.

కొన్ని గదుల్లో కిటికీలుండవు. పైగా ఇరుగ్గా ఉంటాయి. అలాంటప్పుడు గోడకు రెండు అద్దాలు బిగించి, వాటికి చెక్కతోనో, రంగు వేయడం ద్వారానో కిటికీల్లా తయారు చేయండి. దానివల్ల గదికి శోభ వస్తుంది. ఆ నకిలీ కిటికీ గది విశాలంగా ఉన్న భావన కలిగిస్తుంది కూడా.

చిన్న ఎత్తుపీటలు చాలా రకాలు దొరుకుతాయి. కూర్చోవడానికి, ల్యాప్‌టాప్‌ పెట్టుకోవడానికి, ఫ్లవర్‌ వాజ్‌ నిలపడానికి, కుర్చీలో కూర్చుంటే కాళ్లు జాపుకొని పెట్టుకోవడానికి- ఇలా అనేక రకాలుగా పనికొస్తాయి. రంగులూ ఆకృతులను బట్టి ఎత్తు పీటలను ఎంచుకుంటే ముచ్చట గొల్పుతాయి.

దళసరి కాగితం మీద బొమ్మలు వేయమని మీ చిన్నారిని ప్రోత్సహించండి. వాటిల్లో బాగున్న దాన్ని గోడకి తగిలించండి, అది అందంగా ఉండదేమో అనుకోవద్దు. ఊరీ ఊరని ఊరగాయలా వచ్చీ రాని బొమ్మలు తమాషాగా ఉంటాయి. ఇంటికొచ్చిన అతిథులు ఆ ఆకర్షణీయ చిత్రాలను చూసి ఆనందిస్తారు. నెలకోసారి దాన్ని మార్చండి. ఇలా చేయడం వల్ల చిన్నారుల్లో ఎప్పటికప్పుడు మరింత బాగా వేయాలనే ఆసక్తీ కలుగుతుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్