Published : 12/05/2022 00:46 IST

మీకో సొంత కాఫీ స్పాట్‌

మీకో ఆత్మీయ స్నేహితురాలుంది. ఆమెతో కలిసి కాఫీ తాగుతూ కాసేపు హాయిగా ముచ్చటించు కోవాలనిపిస్తుంది. గబుక్కున చెప్పులేసుకుని ఏ కాఫీ షాపుకో, ఇరానీ కేఫ్‌కో వెళ్లే అవకాశం ఉండదు. బోల్డన్ని బాధ్యతలుంటాయి మరి. సరే, ఇంటికే పిలిచారనుకోండి.. ఎక్కడ కూర్చుని కబుర్లు చెప్పుకుంటారు? మీరు వంట చేస్తుంటేనో, మొక్కలకు నీళ్లు పోస్తుంటేనో తానూ సాయం చేస్తూ కబుర్లు చెబుతుంది, అందులో సందేహం లేదు. కానీ కాస్త స్థిమితంగా కూర్చోదలిస్తే?! వసారాలో ఎవరో ఒకరు టీవీ చూస్తుంటారు కనుక అక్కడంత అనుకూలంగా ఉండదు. గదుల్లో ఏదో ఒక వస్తువు తీసుకునేందుకు వస్తూ వెళ్తూ ఉంటారు కనుక అక్కడా వెసులుబాటుగా ఉండదు. అందువల్ల వరండాలోనో బాల్కనీలోనో ఒక మూలగా చిన్న ‘కాఫీ స్పాట్‌’ ఏర్పాటు చేసుకున్నారంటే అక్కడ మీ నెచ్చెలితో మనసారా ముచ్చటించుకోవచ్చు. కావాల్సిందల్లా నాలుగు కుర్చీలూ ఒక టీపాయ్‌. మీరు శ్రద్ధ పెట్టాలే కానీ ఆ కాస్తంత జాగాని ఒక పెయింటింగు, రెండు పూలగుత్తులతో అందంగా, ఆహ్లాదంగా ముస్తాబు చేసుకోవచ్చు. కొన్ని రెస్టారెంట్స్‌లో ‘టేక్‌ ఎ స్టిల్‌’ అంటూ ఒక ప్రత్యేక స్థలాన్ని కేటాయిస్తుంటారు. ఆ అందమైన చోట ఫొటో దిగడాన్ని ఇష్టంగా, తీపిగుర్తుగా దాచుకునేందుకే అక్కడికి వెళ్లే వాళ్లున్నారు. మీ ఇంట్లో మీ సొంత కాఫీ స్పాట్‌ కూడా అలాంటి అనుభూతినిస్తుందంటే అతిశయం కాదు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని