వంటిల్లు సర్దుతున్నారా?

ఎంత పొందిగ్గా పెట్టుకున్నా.. వంటిల్లు మాత్రం త్వరగా గజిబిజిగా మారిపోతుంది. అన్నీ వంటింటి గట్టుపైకే చేరతాయి. చూడ్డానికీ చిరాకు. ఈసారి ఇలా సర్ది చూడండి.

Published : 24 May 2022 01:44 IST

ఎంత పొందిగ్గా పెట్టుకున్నా.. వంటిల్లు మాత్రం త్వరగా గజిబిజిగా మారిపోతుంది. అన్నీ వంటింటి గట్టుపైకే చేరతాయి. చూడ్డానికీ చిరాకు. ఈసారి ఇలా సర్ది చూడండి.

ముందు ర్యాకుల్లో ఉన్న వన్నీ బయట పెట్టేయండి. ఆశ్చర్య పోకండి. సర్దడంలో మొదటి దశ ఏమున్నాయో తెలుసుకోవడమే. అలా తెలియాలంటే.. అన్నీ కళ్ల ముందుకు రావాల్సిందే. ర్యాకులన్నీ శుభ్రం చేసుకున్నాక.. సామానంతటినీ అత్యవసరం, అవసరం, తక్కువ అవసరంగా విభజించుకోండి.

సరుకుల ప్యాకెట్లు వగైరా ఉంటే.. డబ్బాల్లోకి చేర్చేయండి. గడువు ముగిసినవి పడేయండి. బయటకు తీసిన బ్యాటరీలు సహా.. అన్నీ పనిచేస్తున్నాయి అనిపిస్తేనే ఉంచండి.

అత్యవసరం అన్నవి త్వరగా అందేలా, తీసుకోవడానికి అనువుగా ఉండే చోట ఉంచండి. అవసరం అన్నవాటిలోనూ ఎక్కువ ఉంటే రెండు, మూడు దగ్గరుంచుకొని మిగతావి కదిలించని ప్రదేశంలో మూలగా ఉంచండి. ఇక తక్కువ అవసరం ఉన్నవి.. అంటే.. ఎక్కువ మంది వచ్చినపుడు వండటానికి కావాల్సినవీ వగైరా వాటిని పైన పెట్టేయండి. ఇక కొన్నుంటాయి. వాడం, తీసెయ్యాలంటే మనసొప్పదు. అలాంటివాటిని గత మూడు, నాలుగు నెలల్లో పోనీ ఏడాదిలో ఎన్నిసార్లు వాడామని చెక్‌ చేసుకోండి. అసలు వాడలేదనిపిస్తే పక్కన పెట్టేయడమే మంచిది. వీలైతే ఎవరికైనా ఇచ్చేయొచ్చు. వేరే గదుల్లో పెట్టగలిగినవి.. ఉదాహరణకు స్క్రూడైవర్‌, కత్తెర లాంటి వాటిని స్థానాలు మార్చొచ్చు.

సర్దేటపుడే ఖాళీ లేకుండాపెట్టద్దు. అప్పటికి పొందిగ్గానే కనిపిస్తాయి. తిరిగి పెట్టేటప్పుడు, తీసేటపుడే సమస్య. కొద్దిరోజులకే మళ్లీ అంతా గందరగోళ స్థితే. కాబట్టి, ముందుగానే ప్రతి అరలోనూ కొద్ది స్థలం ఉండేలా చూసుకుంటే గజిబిజికి ఆస్కారముండదు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్