వాళ్లు ఇప్పుడే అర్థమయ్యారు!

‘ఉద్యోగం చేసే తల్లుల భావోద్వేగాలను ప్రజలు సరిగా అర్థం చేసుకోవడం లేద’ని ఆవేదన వ్యక్తం చేస్తోంది బాలీవుడ్‌ అగ్రతార అనుష్కాశర్మ. ప్రముఖ క్రికెటర్‌ విరాట్‌ కోహ్లితో వివాహమై, ఓ కూతురికి తల్లి అయిన తర్వాత

Published : 24 May 2022 01:52 IST

‘ఉద్యోగం చేసే తల్లుల భావోద్వేగాలను ప్రజలు సరిగా అర్థం చేసుకోవడం లేద’ని ఆవేదన వ్యక్తం చేస్తోంది బాలీవుడ్‌ అగ్రతార అనుష్కాశర్మ. ప్రముఖ క్రికెటర్‌ విరాట్‌ కోహ్లితో వివాహమై, ఓ కూతురికి తల్లి అయిన తర్వాత నట జీవితానికి కొద్దిగా విరామం ఇచ్చింది. ‘ఇంటిని, పిల్లలను చూసుకుంటూ కెరియర్‌లో రాణించడం చాలా కష్టమైన విషయం. ఈ బాధ్యతలన్నింటినీ జాగ్రత్తగా సమన్వయం చేసుకోవడంలో మహిళలు ఎన్నో అడ్డంకులను ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం ఉద్యోగాల్లో పని తీరు కూడా క్లిష్టంగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో పని చేస్తున్న మహిళలకు ఇంటా బయటా మరింత మద్దతు అందాలని కోరుకుంటున్నా. నేనూ ఒక మహిళనే అయినా... అమ్మనయ్యాకే ఇవన్నీ అర్థమయ్యాయి. ఇప్పుడు తోటి మహిళలను మరింత ప్రేమిస్తున్నా. నాలాంటి తల్లులను చూసినప్పుడు వారిపట్ల గౌరవంతోపాటు సోదరి భావం కలుగుతోంది. ఇప్పటికే చాలామంది మగవారు తమతోపాటు విధులు నిర్వహిస్తున్న మహిళలను గౌరవించి, అర్థం చేసుకొని మెలుగుతున్నారు. పని చేసే తల్లులకు మరిన్ని సౌకర్యాలను కల్పించేందుకు ప్రయత్నిద్దాం. రేపటి ఉన్నతమైన ప్రపంచం కోసం పిల్లల పెంపకం ఎంత ముఖ్యమైందో తెలుసుకొని మనందరం మరింత శ్రద్ధ వహిద్దాం’ అంటోంది అనుష్కా. తను త్వరలో మహిళా క్రికెటర్‌ ఝులన్‌ గోస్వామి బయోపిక్‌లో తను ప్రధానపాత్రలో నటించనుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్