కాప్య్సూల్‌ వార్డ్‌రోబ్‌కు మారతారా

కనిపించిన దుస్తులనల్లా కొంటారు చాలా మంది. వాటిలో అవసరమైన వాటికన్నా, వృథానే ఎక్కువ. ఇలాకాక నచ్చినవి, ఎక్కువగా వాడేవి మాత్రమే సర్దుకునేదే కాప్య్సూల్‌ వార్డ్‌రోబ్‌. మీరూ క్యాప్సుల్‌ క్లోజెట్‌ ట్రెండ్‌కు మారాలనుకుంటే...

Published : 25 May 2022 01:42 IST

కనిపించిన దుస్తులనల్లా కొంటారు చాలా మంది. వాటిలో అవసరమైన వాటికన్నా, వృథానే ఎక్కువ. ఇలాకాక నచ్చినవి, ఎక్కువగా వాడేవి మాత్రమే సర్దుకునేదే కాప్య్సూల్‌ వార్డ్‌రోబ్‌. మీరూ క్యాప్సుల్‌ క్లోజెట్‌ ట్రెండ్‌కు మారాలనుకుంటే...

నవసరపు ఖర్చును అదుపుచేయాలన్నా, అత్యవసరానికి బయటికి వెళ్లాలన్నప్పుడు దుస్తులను తేలికగా ఎంచుకోవాలన్నా.. ఈ తరహా వార్డ్‌రోబ్‌తోనే వీలవుతుంది. సీజన్‌కు తగినట్లు దుస్తులను విడదీసుకోవాలి. అన్ని రకాల టాప్స్‌, స్వెట్‌ షర్ట్స్‌పైకి మ్యాచ్‌ అయ్యే జీన్స్‌, కాటన్‌ ఫాంట్లను ముందుగా సర్దుకోవాలి. తరచూ ధరించే కుర్తా, చుడీదార్‌ సెట్స్‌ వరుసగా ఓవైపు సర్దాలి. తెలుపు, నలుపు షర్ట్స్‌ను హ్యాంగర్‌కు తగిలించాలి. ఎందుకంటే వీటిని తరచూ వాడే అవకాశం ఉంది. అలాగే ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే కట్టే చీరలను క్లోజ్‌గా ఉండే కవర్లలో ఉంచి, పై అరలో సర్దాలి. ఉండే పది వర్ణాల దుపట్టాలను వాటి కోసం లభ్యమవుతున్న ప్రత్యేక హ్యాంగర్లకు వేలాడదీసి వార్డ్‌రోబ్‌కు ఓ మూలగా ఉంచితే, కావాల్సినప్పుడు మ్యాచింగ్‌ తేలిగ్గా గుర్తించొచ్చు. మడిచిన లెగ్గింగ్స్‌ను అట్టపెట్టెలో సర్ది, కింద అలమరలో ఉంచితే చాలు. అయితే దుస్తులన్నీ ఎంత తక్కువగా ఉంటే అంత మంచిది.

ఎంచుకోవాలి..

సమావేశాలకు, టూర్లకు ధరించాల్సిన బ్లేజర్స్‌, కోట్లు వంటివి రెండు మూడింటిని ఎంచుకోవాలి. కొనుక్కునేటప్పుడే కొన్ని సూట్స్‌పైకి సరిపోయేలా ఎంపిక చేసుకోవాలి. వీటిని హ్యాంగర్లకు తగిలిస్తే వార్డ్‌రోబ్‌లో ఎక్కువ స్థలం అవసరం ఉండదు. చలికాలం, వర్షాకాలం ధరించే ఊలు వస్త్రాలు, సాక్సులు, షాల్స్‌ వంటివన్నీ వేరే వార్డ్‌రోబ్‌లోకి తరలిస్తే మంచిది. ఇలా సీజన్‌కు తగినట్లు దుస్తులను సర్దుకోవడమే కాదు, షాపింగ్‌కు వెళ్లాలనిపిస్తే ఒకటికి రెండు సార్లు ఆలోచించడం నేర్చుకోవాలి. అలాకాకుండా వేరే పనిపై వెళ్లినాకూడా, కావాల్సిన వస్తువులను మాత్రమే పట్టికగా రాసి నియమంగా వాటితోనే ఇంటికి తిరిగిరావాలి. ఆన్‌లైన్‌లో తరచూ దుస్తుల యాప్‌లోకి వెళ్లకపోవడం మంచిది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్