వర్షాల వేళ వార్డ్‌రోబ్‌ జాగ్రత్త!

చినుకులు మొదలయ్యాయంటే దుస్తులు త్వరగా ఆరవు. అల్మరల్లోకి తేమ చేరడం, వస్త్రాల నుంచి ఒకలాంటి వాసన వంటివి వస్తుంటాయి. వీటి నుంచి తప్పించుకోవాలా? ఈ చిట్కాలు పాటించేయండి. అలమరాల్లో దట్టంగా వార్తాపత్రికలను పరిచి ఉంచండి. ఇవి తేమను పీల్చేస్తాయి. దుస్తులు పూర్తిగా ఆరాయి అన్న తరువాతే కప్‌బోర్డ్‌లో పెట్టండి. ఎండ లేదనిపిస్తే హెయిర్‌ డ్రైయర్‌తో ఓసారి ఆరబెట్టాకే....

Updated : 12 Aug 2022 15:06 IST

చినుకులు మొదలయ్యాయంటే దుస్తులు త్వరగా ఆరవు. అల్మరల్లోకి తేమ చేరడం, వస్త్రాల నుంచి ఒకలాంటి వాసన వంటివి వస్తుంటాయి. వీటి నుంచి తప్పించుకోవాలా? ఈ చిట్కాలు పాటించేయండి.

అలమరాల్లో దట్టంగా వార్తాపత్రికలను పరిచి ఉంచండి. ఇవి తేమను పీల్చేస్తాయి. దుస్తులు పూర్తిగా ఆరాయి అన్న తరువాతే కప్‌బోర్డ్‌లో పెట్టండి. ఎండ లేదనిపిస్తే హెయిర్‌ డ్రైయర్‌తో ఓసారి ఆరబెట్టాకే లోపల పెట్టండి. లేదంటే దుర్వాసన వస్తాయి.

ఫ్యాను గాలికి ఆరతాయని రాత్రుళ్లు ఆరని దుస్తులను ఇంట్లో ఆరేయడం మనకు అలవాటే. కానీ అవి ఆరకపోగా ఒకలాంటి వాసన వేస్తాయి. దుస్తులంటే మళ్లీ ఉతుక్కోవచ్చు. కానీ గదుల్లోంచి ఆ వాసన చాలా రోజులపాటు అలాగే ఉండిపోతుంది.

తేమ కారణంగా అలమరాల్లో చిన్న చిన్న పురుగులూ వచ్చి చేరతాయి. ఇవి దుస్తులను పాడు చేయడమే కాదు.. శరీరానికీ అలర్జీలు కలగజేస్తాయి. అందుకే మూలల్లో ఎండిన వేపాకులను ఉంచండి. వాటి బెడద ఉండదు.

తేమ ఎక్కువగా ఉందనిపిస్తే ఒక ఉప్పు ప్యాకెట్‌ను చివర కొద్దిగా కత్తిరించి ఉంచండి. లేదా సిలికా జెల్‌ ప్యాకెట్లు మార్కెట్‌లో దొరుకుతాయి, వాటిని ఉంచినా తేమను పీల్చేస్తాయి.

ఉపయోగించని బ్యాగులు, చెప్పులు, బూట్లను వస్త్రంలో లేదా పేపర్లలో చుట్టిపెడితే తేమకి పాడవకుండా ఉంటాయి.

ఎండ వచ్చినపుడు అది గదిలోకి పడేలా కిటికీలు, తలుపులతోపాటు వార్డ్‌రోబ్‌నీ తెరచి ఉంచాలి. అప్పుడే గదిలోంచి కూడా ముక్కవాసన తొలగిపోతుంది. తేమ కారణంగా ఫంగస్‌ వంటివి కనిపిస్తే డిస్‌ఇన్ఫెక్టెంట్‌లతో వెంటనే శుభ్రం చేయాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్