అలంకరణకు ఐదు
మొక్కల్ని చూస్తేనే ఉల్లాసం కలుగుతుంది కదూ! అవి పర్యావరణ కాలుష్యాన్నీ తగ్గిస్తాయి. బయట పెరిగే చెట్ల గురించి అలా ఉంచితే కొన్ని ఇండోర్ ప్లాంట్స్ పెంచుకుంటే వరండా, హాలు, డ్రాయింగ్ రూముల అందాన్ని పెంచుతాయి, ఆహ్లాదాన్నీ పంచుతాయి. అలాంటి మొక్కలే ఇవన్నీ...
మొక్కల్ని చూస్తేనే ఉల్లాసం కలుగుతుంది కదూ! అవి పర్యావరణ కాలుష్యాన్నీ తగ్గిస్తాయి. బయట పెరిగే చెట్ల గురించి అలా ఉంచితే కొన్ని ఇండోర్ ప్లాంట్స్ పెంచుకుంటే వరండా, హాలు, డ్రాయింగ్ రూముల అందాన్ని పెంచుతాయి, ఆహ్లాదాన్నీ పంచుతాయి. అలాంటి మొక్కలే ఇవన్నీ...
అరేకా పామ్... కొబ్బరి, ఈత మొక్కల్ని తలపించే అరెకా పామ్ చూడచక్కగా ఉంటుంది. ఎక్కువ నీళ్లు లేదు. ఆకులు మరీ నాజూగ్గా ఉండవు కనుక చంటి పిల్లలకు కొంచెం దూరంగా పెడితే మంచిది.
మనీప్లాంట్ మార్బుల్ ప్రిన్స్... ఆకుపచ్చ, పసుపు రంగుల కలయికతో ముచ్చటగొలిపే ఈ మొక్క మనీప్లాంట్ లాంటిదే. వాతావరణాన్ని బట్టి ఆకుల రంగే కాదు ఆకృతి కూడా కాస్త మారుతుంటుంది. దీన్ని మట్టిలో, నీళ్లలో కూడా పెంచవచ్చు.
పీస్ లిల్లీ... పేరుకు తగ్గట్టుగానే ప్రశాంతత అందించే లిల్లీ. ఇవి ఇతర లిల్లీల్లా ఉండవు, గుత్తులుగా అసలే పూయవు. శంఖాల్లా కనిపిస్తూ కనువిందు చేస్తాయి. కానుకగా ఇవ్వడానికి కూడా బాగుంటాయి.
ఎలిఫెంట్ బుష్... నిజానికి ఈ మొక్క ఏనుగులా పెద్దగా కానీ పొదలా గుబురుగా కానీ ఉండదు. చిన్న దళసరి ఆకులు, ఎర్రటి కాడలతో ఆకర్షణీయంగా ఉంటుంది. ఈ మొక్కను వేడుకల్లో గిఫ్ట్‌గా ఇస్తున్నారు.
సిల్వర్ డాలర్... దీని ఆకులు ఎంత బాగుంటాయంటే పట్టుకుని చూస్తే తప్ప సహజం కావేమో, అలా తయారు చేశారేమో అనిపిస్తుంది. దీన్ని చక్కటి సిరామిక్ పాట్‌లో పెంచితే కళ్లకు విందే. ఇంటికొచ్చిన బంధుమిత్రులు కూడా దీన్ని చూసి మురిసిపోతారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.