ఒకే వర్ణం... ఒకింత అందం..

అందం కోసం ఇండోర్‌ మొక్కలపైనే కాదు.. వాటిని ఉంచే తొట్టెలపైనా దృష్టిపెట్టాలంటున్నారు నిపుణులు.  ఇవన్నీ ఒకే వర్ణంలో ఉంటే ఒకింత అందం పెరుగుతుంది అంటున్నారు.

Published : 10 Aug 2023 00:01 IST

అందం కోసం ఇండోర్‌ మొక్కలపైనే కాదు.. వాటిని ఉంచే తొట్టెలపైనా దృష్టిపెట్టాలంటున్నారు నిపుణులు.  ఇవన్నీ ఒకే వర్ణంలో ఉంటే ఒకింత అందం పెరుగుతుంది అంటున్నారు.

పింగాణీలో.. తొట్టెలనిప్పుడు పలురకాల పదార్థాలతో సృజనాత్మకంగా తయారు చేస్తున్నారు. గదికి తగ్గట్లుగా వాటిని ఎంచుకుంటే ఇంటి అందాన్ని మరింత పెంచుకోవచ్చు. అయితే ఆకారం ఏదైనా భిన్న పరిణామాల్లో ఉన్న రెండు మూడింటిని ఒకే వర్ణంలో ఉన్నవి తెచ్చుకోండి. ఇంటి కళే మారిపోతుంది. పాత జాడీలు ఇంట్లో వృథాగా పడి ఉన్నాయా? వాటినీ బయటికి తీసి మొక్కలతోపాటు పూల కొమ్మలను ఉంచి డైనింగ్‌ లేదా రీడింగ్‌ టేబుల్‌పై సర్దితే చాలు. అలనాటి సంప్రదాయానికి కొత్త అందాన్ని అద్దినట్లు అనిపిస్తుంది.

లోహాలతో.. ఇత్తడి, రాగి, కంచు వంటి లోహాల తొట్టెలు చూడముచ్చటగా ఉంటాయి కదూ! మట్టి తొట్టెతో సహా మొక్కను ఈ లోహ కుండీల్లో సర్దితే సరి. బాల్కనీ కిటికీ వద్ద, ముందుగది సోఫా పక్కగా వీటిని ఉంచితే గదికి కొత్త రూపు ఇచ్చినట్లు అవుతుంది. కొత్తవే కొనక్కర్లేదు. ఇంట్లో వృథాగా పడిఉన్న అలనాటి సంప్రదాయ పాత్రలనూ ఇలా కుండీలా మార్చేయొచ్చు.

గాజులో.. పగులుతాయేమో అని భయపడతాం కానీ.. గాజు కుండీలూ ఇంటి అందాన్ని పెంచుతాయి. పైగా ఇప్పుడు సెల్ఫ్‌ వాటరింగ్‌వి ట్రెండ్‌ కూడా. వీటిలో ఇండోర్‌ మొక్కలను పెంచి ముందుగది లేదా భోజనబల్లపై అమర్చి చూడండి. లోపల నుంచి మట్టి కుండీలు పైకి పారదర్శకంగా కనిపించినా అదీ అందమే. వీటన్నింటినీ సైజులవారీగా వరసగా ఒకేచోట సర్దితే చాలు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్