మనకుందో ప్రత్యేక పార్కు!

లింగ వివక్షను తొలగించడం, స్త్రీసమున్నతి లక్ష్యాలుగా మన దేశంలో తొలి ‘జెండర్‌ పార్క్‌’ కేరళలో రూపుదిద్దుకుంది. దీని కోసం కేరళ ప్రభుత్వం రూ.300 కోట్లు వెచ్చించనుంది.

Published : 11 Jul 2021 00:47 IST

లింగ వివక్షను తొలగించడం, స్త్రీసమున్నతి లక్ష్యాలుగా మన దేశంలో తొలి ‘జెండర్‌ పార్క్‌’ కేరళలో రూపుదిద్దుకుంది. దీని కోసం కేరళ ప్రభుత్వం రూ.300 కోట్లు వెచ్చించనుంది. తిరువనంతపురంలోని కొజికోడ్‌లో  ఉన్న ఈ పార్క్‌ కోసం 24 ఎకరాలను కేటాయించారు. 2013 నుంచి రకరకాల అడ్డంకులను దాటి ఈ పార్కు ఇటీవలే ప్రారంభం అయింది. మహిళా వ్యాపారులు తమ ఉత్పత్తులను మార్కెట్‌ చేసుకోవడానికి కూడా ఇది మంచి వేదికగా నిలుస్తుంది. ఈ పార్కులో జెండర్‌ లైబ్రరీ, జెండర్‌ మ్యూజియం, నాటకశాల, సభాస్థలి (కన్వెన్షన్‌ సెంటర్‌) ఉంటాయి. మహిళా చైతన్య సాహిత్యం, గొప్ప మహిళల చరిత్రలు, వారి స్ఫూర్తి, కృషి... తదితరాలకు సంబంధించిన పుస్తకాలు జెండర్‌ లైబ్రరీలో ఉంటాయి. మహిళా ఉద్యమాలు, జరిగిన మార్పులు, మేలి మలుపులు, సాధించిన విజయాలు మొదలైన విషయాలన్నీ మ్యూజియంలో చూడొచ్చు. ఇక సభాస్థలి మహిళా సంబంధిత కార్యక్రమాలకు వేదిక. కన్వెన్షన్‌ సెంటర్‌లో 500 మంది ఒకే సారి సమావేశం ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ పార్కు ఏర్పాటులో కీలక భూమిక పోషించిన ఆరోగ్య శాఖ మాజీ మంత్రి కె.కె.శైలజ మాట్లాడుతూ ‘ఇది దేశంలో మొదటిదే కాదు, ప్రపంచంలోనే మహిళా సంబంధిత నిర్మాణాల్లో పెద్దది. మహిళా సాధికారతకు ఇది ఎంతో దోహదం చేయగలదు’ అన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్