అమ్మాయిలూ వెనకబడొద్దు?

చదువు, విజ్ఞానం పరంగా ముందున్నా.. కొన్ని రకాల స్కిల్స్‌పరంగా అమ్మాయిలు వెనకే ఉన్నారంటున్నాయి కొన్ని రకాల అధ్యయనాలు. విదేశీ విద్య అయినా, ఉద్యోగమైనా.. సంస్థలు దరఖాస్తుల్లో కొన్ని నైపుణ్యాల కోసం చూస్తుంటాయి. వాటిని ముందస్తుగానే అందుకోవడం తప్పనిసరి....

Updated : 24 Aug 2021 05:09 IST

చదువు, విజ్ఞానం పరంగా ముందున్నా.. కొన్ని రకాల స్కిల్స్‌పరంగా అమ్మాయిలు వెనకే ఉన్నారంటున్నాయి కొన్ని రకాల అధ్యయనాలు. విదేశీ విద్య అయినా, ఉద్యోగమైనా.. సంస్థలు దరఖాస్తుల్లో కొన్ని నైపుణ్యాల కోసం చూస్తుంటాయి. వాటిని ముందస్తుగానే అందుకోవడం తప్పనిసరి.

* హార్డ్‌ స్కిల్స్‌.. వీటినే టెక్నికల్‌ సిల్స్‌ అనీ పిలుస్తారు. ఎంచుకున్న విభాగమేదైనా వీటిని అందిపుచ్చుకోవాల్సిందే. అయితే అవి సాధారణంగా ఏ రెజ్యూమె చూసినా కనిపించేవి అయ్యుండకూడదు. పరిశ్రమకు సంబంధించినవైతే మంచిది.

* తోటి వాళ్లతో కలిసిపోవడం.. సంస్థ అయినా విశ్వ విద్యాలయమైనా చూసే ప్రధాన లక్షణం ఇదే. కాబట్టి, భాషా నైపుణ్యాలతోపాటు ధైర్యంగా మాట్లాడే, సులువుగా కలిసిపోయే పద్ధతినీ అలవరచుకోవాలి. కళాశాల కమిటీలు, సెమినార్లు వంటి వాటిల్లో పాల్గొంటే ఈ నైపుణ్యాలు సులువుగా వస్తాయి.

* మొక్కుబడిగా వద్దు.. చదువుతూనే పని వాతావరణం గురించి తెలుసుకునే అవకాశాన్ని ఇంటర్న్‌షిప్‌లు అందిస్తాయి. వీటిని మొక్కుబడిగానో కాకుండా సీరియస్‌గా చేయండి. నిజంగా నేర్చుకునే అవకాశం వీటిద్వారానే కలుగుతుంది.

* సమయానికి అనుగుణంగా ప్రవర్తించడం.. దీన్నే ట్రాన్ఫరబుల్‌ స్కిల్‌గానూ చెప్పొచ్చు. పరిస్థితిని బట్టి.. మల్టీటాస్కింగ్‌, బృందాన్ని నడిపించగలగడం, త్వరగా స్పందించగలగడం, త్వరితగతిన నిర్ణయాలు తీసుకోవడం వంటివి అలవాటు చేసుకోవాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్