Women Safety App:నారీ రక్షణకు నాలుగు బటన్స్‌

కష్ట సమయాల్లో ఆదుకోవడానికి నలుగురు ఉండాలి అంటుంటారు. అలాంటి వాళ్లు ఉండటం ఎంత ముఖ్యమో... వారికి ఆ సమయంలో మీ పరిస్థితీ తెలియడమూ అంతే ముఖ్యం. నేను ఫలానా ప్రాంతంలో ఉన్నాను అని పక్కాగా

Updated : 17 Jan 2022 19:35 IST

ష్ట సమయాల్లో ఆదుకోవడానికి నలుగురు ఉండాలి అంటుంటారు. అలాంటి వాళ్లు ఉండటం ఎంత ముఖ్యమో... వారికి ఆ సమయంలో మీ పరిస్థితీ తెలియడమూ అంతే ముఖ్యం. నేను ఫలానా ప్రాంతంలో ఉన్నాను అని పక్కాగా చెబితే సాయం అందించడం సులభం. దీనికి ఓ మొబైల్‌ యాప్‌ ఉంది. అదే ‘సెకురా’. ఈ యాప్‌ను ప్లేస్టోర్‌/ యాప్‌ స్టోర్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోండి.

దీన్ని వినియోగించడం సులభం. యాప్‌ను ఓపెన్‌ చేశాక నాలుగు బటన్స్‌ ఉన్న చక్రం లాంటిది కనిపిస్తుంది. స్క్రీన్‌ పైన ఎడమవైపున సెట్టింగ్స్‌ బటన్‌ ఉంటుంది. అందులో అత్యవసర నెంబరును యాడ్‌ చేసుకోవచ్చు. మీ సమాచారాన్ని మెసేజ్‌లా పంపాలా లేక వాట్సాప్‌ ద్వారా పంపాలా అనేదీ ఎంచుకోవచ్చు. ఇలా యాప్‌ అడిగిన పర్మిషన్లు ఇచ్చాక... మీ అత్యవసర కాంటాక్ట్‌ను యాడ్‌ చేసుకోండి.

బటన్స్‌లో ఆకుపచ్చది టచ్‌ చేస్తే పెద్దగా డేంజర్‌ అలారమ్‌ మోగుతుంది. ఎరుపు రంగుది క్లిక్‌ చేస్తే అత్యవసర నెంబరుకు కాల్‌ వెళ్తుంది. నారింజ రంగు బటన్‌ను క్లిక్‌ చేస్తే మీరున్న ప్రదేశం గూగుల్‌ మ్యాప్‌ లొకేషన్‌ లింక్‌ వెళ్తుంది. వంకాయ రంగు బటన్‌ను క్లిక్‌ చేస్తే ఫేక్‌ కాల్‌ వస్తుంది. ఇలా మీకు మీరు రక్షణ కల్పించుకోవచ్చు. మీ పరిస్థితి శ్రేయోభిలాషులకూ తెలుస్తుంది.

https://play.google.com/store/apps/details?id=com.tifi.sekura&hl=en

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్