కోపానికి... కాసేపు నడక

సరళ అప్పటివరకు నిశ్శబ్దంగా తన పని చేసుకుంటూ ఉంటుంది. ఎవరైనా తనను చిన్నగా విమర్శించినా.. వెంటనే తీవ్రంగా ప్రతిస్పందిస్తుంది. ఎప్పటికప్పుడు తనను తాను నియంత్రించుకోవాలని ప్రయత్నించినా.. సాధించలేకపోతోంది. దీనికి కొన్ని నియమాలు పాటించాలంటున్నారు నిపుణులు.

Published : 01 Aug 2022 00:52 IST

సరళ అప్పటివరకు నిశ్శబ్దంగా తన పని చేసుకుంటూ ఉంటుంది. ఎవరైనా తనను చిన్నగా విమర్శించినా.. వెంటనే తీవ్రంగా ప్రతిస్పందిస్తుంది. ఎప్పటికప్పుడు తనను తాను నియంత్రించుకోవాలని ప్రయత్నించినా.. సాధించలేకపోతోంది. దీనికి కొన్ని నియమాలు పాటించాలంటున్నారు నిపుణులు.

దుటివారిపై కోపాన్ని ప్రదర్శించేముందు కొంతసేపు ఆలోచించాలి. మనసుకు నచ్చనిది లేదా చేయని తప్పును చేశారని ఏదో ఒకటి అవతలివారు విమర్శించినా కూడా వారికి సమాధానం చెప్పకముందు కొన్ని నిమిషాలు నిశ్శబ్దంగా ఉండటం మంచిది. అప్పుడే మనసు ఆలోచించడానికి సమయం తీసుకుంటుంది. ఆ క్షణంలో వచ్చే కోపం తీవ్రత తగ్గుతుంది. దాంతో అరిచే స్థాయి నుంచి మాట్లాడే స్థాయికి మెదడు సిద్ధపడుతుంది. లేదంటే నోటికి వచ్చిన మాట అవతలివారిని అనేసి, ఆ తర్వాత మాటను వెనక్కి తీసుకోలేరు. ఆ పొరపాటును దిద్దుకోలేని పరిస్థితిని ఎదుర్కోవలసి వస్తుంది. దీనికి బదులుగా కొన్ని క్షణాలు నిశ్శబ్దంగా ఉండటమే మంచిది.

నాలుగు అడుగులు... శారీరక, మానసిక ఒత్తిడివల్ల కూడా కొన్ని సందర్భాల్లో  కోపం అదుపులో ఉండదు. దీనికి వ్యాయామం, యోగా వంటివి పరిష్కారాన్నిస్తాయి. మనసును ప్రశాంతంగా ఉంచుతాయి. అమితంగా కోప్పడే గుణం నెమ్మదిగా తగ్గుతుంది. అలాగే మనసులో అవతలివారిపై విపరీతమైన కోపం వచ్చినప్పుడు అక్కడి నుంచి దూరంగా వెళ్లి పది నిమిషాలు నడవడం మంచిదంటున్నారు నిపుణులు. లేదా మనసుకు నచ్చినదేదైనా చేయడానికి ప్రయత్నిస్తే చాలని చెబుతున్నారు. నిరంతరాయంగా పనిచేసినా.. మనసు అలసి అది కోపంగా మారే ప్రమాదం ఉంది. దీనికి చెక్‌ పెట్టాలంటే పని మధ్యలో కాసేపు విరామం తీసుకుంటే చాలు.

పని ప్రదేశంలో ... నేను చేసిందే సరైనది లేదా నన్ను ఎదుటివారు అనడానికి సరిపోరు వంటి ఆలోచనలతో పనిచేసే చోట అవతలివారిపై కోపాన్ని ప్రదర్శిస్తే అది నష్టంగా మారే ప్రమాదం ఉంది. ఇటువంటి ఆలోచనాతీరు ఉంటే తక్షణమే మార్చుకోవాలి. బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించడంలో బృందానికి సహకరించడానికి కృషి చేయాలి. కోపాన్ని అదుపులో ఉంచుకొనే నైపుణ్యాన్ని పెంచుకోవాలి. అలాగే కోపం తీవ్ర స్థాయిలో ఉన్నప్పుడు పది వరకు అంకెలు లెక్కపెట్టడం మంచిది. మనసుకు నచ్చిన సంగీతం విన్నా కూడా కోపం అదుపులోకి వస్తుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్