ఉపాధిగా మారిన సాహసం

బల్లిని చూస్తేనే భయపడుతుంటారు చాలా మంది.. అలాంటిది పడగెత్తి ఆడే పాములను చూస్తే? మనిషెత్తున లేచి బుసలు కొట్టే తాచు పాములను చూస్తే... ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఓ మహిళ... ప్రాణాలకు తెగించి సర్పాలను పట్టుకొని ఔరా అనిపిస్తోంది. సాధారణంగా ఏ మహిళా ఎంచుకోని రంగాన్ని ధైర్యంగా ఎంచుకుంది కరీంనగర్‌ తీగులగుట్టపల్లికి చెందిన షేక్‌సయిదా.

Published : 23 Jul 2021 01:07 IST

ల్లిని చూస్తేనే భయపడుతుంటారు చాలా మంది.. అలాంటిది పడగెత్తి ఆడే పాములను చూస్తే? మనిషెత్తున లేచి బుసలు కొట్టే తాచు పాములను చూస్తే... ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఓ మహిళ... ప్రాణాలకు తెగించి సర్పాలను పట్టుకొని ఔరా అనిపిస్తోంది. సాధారణంగా ఏ మహిళా ఎంచుకోని రంగాన్ని ధైర్యంగా ఎంచుకుంది కరీంనగర్‌ తీగులగుట్టపల్లికి చెందిన షేక్‌సయిదా. దీన్ని వృత్తిగా స్వీకరించి ఇప్పటి వరకు 15వేలకు పైగా పాములను పట్టుకొంది. చిమ్మని చీకట్లోనైనా.. గుబురు పొదల్లోనైనా పాము ఉంటే చాలు ఇట్టే కనిపెట్టేస్తుంది. ప్రేమ వివాహం చేసుకొన్న సయిదా భర్తకు పాములను పట్టడంలో చాలా నైపుణ్యం ఉంది. ఎక్కడెక్కడి నుంచో వచ్చి అతన్ని పిలుచుకుని వెళ్లేవారు. అతని ద్వారా పాములు పట్టుకోవడంలో మెలకువలను నేర్చుకుంది. భర్త అకస్మాతుగా చనిపోయాడు. కుటుంబ పోషణ కోసం దీన్నే ఉపాధిగా స్వీకరించింది.

వేల పాముల్ని పట్టుకున్నా ఇప్పటి వరకూ ఏదీ కాటువేయ లేదంటే ఆమె నేర్పరితనం ఏమిటో అర్థం చేసుకోవచ్చు. పాము కనిపించిన ప్రాంతంలో లైట్లను ఆర్పేసి జాగ్రత్తగా అలికిడి ద్వారానే గుర్తు పట్టేస్తుంది. దాని ఆధారంగానే చిన్న కర్ర సాయంతో ఎంతటి పామునైనా పట్టుకొంటుంది. ఎంతటి పుట్టలను, బొరియలనైనా తవ్వి పాముల్ని వెలికితీస్తుంది. ప్రతి నెలా 15 నుంచి 20 వరకు విషసర్పాలను పట్టుకుంటానంటుదీమె. తన కుమారుడు నసీర్‌కు సైతం ఈ విద్యను నేర్పించడం విశేషం. ఆ అబ్బాయి మాత్రం నాలుగైదు సార్లు పాటు కాటు బారిన పడ్డాడు. అలా జరిగినప్పుడు విషం నరాల్లోకి ఎక్కకుండా వెంటనే ఆ భాగాన్ని గట్టిగా కట్టి.. బ్లేడుతో అక్కడ గాటు పెట్టి రక్తం బయటికి వెళ్లేలా జాగ్రత్తలు తీసుకుంటామని వివరించింది. ఎలాంటి పామునైనా ఎంతో మనోధైర్యంతో చటుక్కున పట్టేసే సయిదాని చూసి అందరూ ఆశ్చర్యపోతుంటారు.

- అలీముద్దీన్‌, కరీంనగర్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్