105 ఏళ్లకు.. ఆమెకు పగ్గాలు!

జూలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా (జెడ్‌ఎస్‌ఐ)కి 105 ఏళ్ల చరిత్ర ఉంది. దానికి డాక్టర్‌ ధ్రుతి బెనర్జీ డైరెక్టర్‌ బాధ్యతలు స్వీకరించారు. సంస్థ స్థాపించాక ఈ పదవి చేపట్టిన....

Published : 31 Aug 2021 00:48 IST

జూలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా (జెడ్‌ఎస్‌ఐ)కి 105 ఏళ్ల చరిత్ర ఉంది. దానికి డాక్టర్‌ ధ్రుతి బెనర్జీ డైరెక్టర్‌ బాధ్యతలు స్వీకరించారు. సంస్థ స్థాపించాక ఈ పదవి చేపట్టిన మొదటి మహిళా ఈవిడే!

ధ్రుతి బెనర్జీ ఫిలాసఫీలో డాక్టరేట్‌ చేశారు. ఈమెది కోల్‌కతా. నేషనల్‌ స్కాలర్‌షిప్‌తోపాటు ఎన్నో జాతీయ, అంతర్జాతీయ ఫెలోషిప్‌లనూ అందుకున్నారు. పర్యావరణం, నేచురల్‌ సైన్సెస్‌పై ఆసక్తి ఎక్కువ. జూజియోగ్రఫీ, టాక్సానమీ, మైక్రోబయాలజీల్లో పరిశోధకురాలు. వీటి గురించి మరింత తెలుసుకోవాలనే ఆసక్తితో కోల్‌కతాలోని జూలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా (జెడ్‌ఎస్‌ఐ)లో చేరారు. జంతు సంపద, జీవవైవిధ్యాలపై పనిచేశారు. వివిధ జంతుజాలాల నివాసం, జెనెటిక్స్‌, మాలిక్యులర్‌ ఇన్ఫర్మేషన్‌ మొదలైన అంశాలపై పరిశోధనలు చేశారు. సంస్థలో ఎన్నో పదవులు నిర్వహించి, డైరెక్టర్‌ స్థాయికి ఎదిగారు. జెడ్‌ఎస్‌ఐ 1961లో ప్రారంభమైంది. మహిళలు పనిచేయడం 1949 నుంచే మొదలైనా ఇంతవరకూ డైరెక్టర్‌ బాధ్యతలను చేపట్టింది లేదు.

‘ఇల్లు, ఆఫీసు రెండింటినీ సమన్వయం చేసుకోగల సత్తా ఆడవాళ్లకి ఉంది. కాకపోతే అందుకు కుటుంబ ప్రోత్సాహమూ కావాలి. నాకు నా భర్త, కూతురి నుంచి అది లభించింది. జెడ్‌ఎస్‌ఐ మహిళా సైంటిస్టులు హిమాలయాల నుంచి లోతైన సముద్రాల వరకు వివిధ రకాల జీవవైవిధ్యాలపై ఎన్నో సర్వేలను నిర్వహిస్తుంటారు. దాదాపు 60% కొత్త జీవాలను కనుకున్నదీ ఆడవాళ్లే. వాళ్ల శాస్త్రీయ సామర్థ్యానికి తార్కాణమిది’ అంటారు ధ్రుతి. రానున్న సంవత్సరాల్లో ఇది ఇంకా పెరిగి ఎన్నో కీలక బాధ్యతల్లోకి మహిళలు వస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ధ్రుతి హిమాలయాల్లో జీవవైవిధ్యం, అక్కడ వాతావరణ మార్పులు జీవులపై ఎలాంటి ప్రభావం చూపుతోందన్న అంశంపై పరిశోధన చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్