ఆమెదే ‘ఫ్యూచర్‌’

ఆటోమొబైల్‌, యంత్ర పరికరాల తయారీ పరిశ్రమలు... వంటివి పూర్తిగా పురుషాధిక్య రంగాలు. ఇప్పటి వరకూ అందరూ అనుకునేది అదే. అయితే ఆ భావనను తొలగించడానికి తొలి అడుగు వేసింది ఓలా. ఎలక్ట్రిక్‌ వాహనాల విపణిలోకి అడుగుపెట్టిన ఆ సంస్థ.. తమిళనాడులో ‘ఓలా ఫ్యూచర్‌ ఫ్యాక్టరీ’ పేరుతో నిర్మిస్తోన్న అతిపెద్ద తయారీ యూనిట్‌ని భవిష్యత్తులో మహిళలే నిర్వహిస్తారని ప్రకటించింది.

Updated : 14 Sep 2021 01:18 IST

టోమొబైల్‌, యంత్ర పరికరాల తయారీ పరిశ్రమలు... వంటివి పూర్తిగా పురుషాధిక్య రంగాలు. ఇప్పటి వరకూ అందరూ అనుకునేది అదే. అయితే ఆ భావనను తొలగించడానికి తొలి అడుగు వేసింది ఓలా. ఎలక్ట్రిక్‌ వాహనాల విపణిలోకి అడుగుపెట్టిన ఆ సంస్థ.. తమిళనాడులో ‘ఓలా ఫ్యూచర్‌ ఫ్యాక్టరీ’ పేరుతో నిర్మిస్తోన్న అతిపెద్ద తయారీ యూనిట్‌ని భవిష్యత్తులో మహిళలే నిర్వహిస్తారని ప్రకటించింది. ‘పదివేల మంది మహిళా ఉద్యోగుల నియామకంతో ప్రపంచంలోనే అతి పెద్ద మహిళా ఫ్యాక్టరీగానూ, స్త్రీలు మాత్రమే పనిచేసే ఏకైక వాహన తయారీ సంస్థగానూ గుర్తింపు పొందుతుందని’ ఆ సంస్థ సీఈవో భవీష్‌ అగర్వాల్‌ చెప్పారు. అందులో భాగంగానే మొదటి బ్యాచ్‌ మహిళా ఉద్యోగినులతో సెల్ఫీ తీసుకుని ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. ఇప్పటికే ఇది ప్రపంచంలోనే అతి పెద్ద ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ ప్లాంట్‌గానూ పేరు పొందింది. ఈ చర్యతో ఆటోమొబైల్‌ రంగంలో కొత్త శకం ప్రారంభమవుతుందని ఆశిద్దాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్