తొలి మహిళా డ్రైవర్లుగా...

ఇండోర్‌లో 2019లో మహిళా ప్రయాణీకుల కోసం ప్రత్యేకంగా రెండు పింక్‌ ఐబస్‌లను ప్రారంభించగా, వీటిలో కండక్టర్లుగా మహిళలు విధులు నిర్వర్తించేవారు. డ్రైవర్లుగా మాత్రం పురుషులుండేవారు. అటల్‌ ఇండోర్‌ సిటీ...

Published : 13 Dec 2021 01:24 IST

ఇండోర్‌లో 2019లో మహిళా ప్రయాణీకుల కోసం ప్రత్యేకంగా రెండు పింక్‌ ఐబస్‌లను ప్రారంభించగా, వీటిలో కండక్టర్లుగా మహిళలు విధులు నిర్వర్తించేవారు. డ్రైవర్లుగా మాత్రం పురుషులుండేవారు. అటల్‌ ఇండోర్‌ సిటీ ట్రాన్స్‌పోర్ట్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌ (ఏఐసీటీఎస్‌ఎల్‌) తాజాగా ఇద్దరు మహిళలను డ్రైవర్లుగా నియమించింది. వాళ్లు ఎవరంటే...

ధ్యప్రదేశ్‌లో ఆటోరిక్షా, క్యాబ్‌, టాక్సీలను అత్యధికంగా మహిళలు నడుపుతూ మహిళా సాధికారతకు ప్రతీకగా నిలుస్తున్నారు. ఇప్పుడక్కడ రెండు పింక్‌ ఐబస్సులకు డ్రైవర్లుగా నియమితులైన 35 ఏళ్ల రితూ నార్వాలే, 25 ఏళ్ల అర్చనా కటారేలు రాష్ట్రంలో తొలి మహిళా డ్రైవర్లుగా నిలిచారు.


అసాధ్యం అన్నారు... రితూ నార్వాలే

త్నీపురాకు చెందిన రితూది మధ్యతరగతి కుటుంబం. తండ్రి ఎలక్ట్రీషియన్‌. చిన్నప్పటి నుంచి భారీ వాహనాలు నడపాలనే కల రితూది. ఆ లక్ష్యం చాలా కష్టమని చెప్పేవాడు తండ్రి. హెవీ వెహికల్స్‌ను నియంత్రించడం  మహిళల వల్ల కాదు, మగవారు మాత్రమే చేయగలుగుతారనేవాడు. అయినా అదే రంగాన్ని ఎంచుకోవాలనుకుందామె. మొదట కారు డ్రైవింగ్‌తో కెరీర్‌ను ప్రారంభించింది.  ‘పర్యటకుల కోసం కారు నడిపే ఉద్యోగంలో చేరా. మనసులో మాత్రం హెవీ వెహికల్‌ డ్రైవింగ్‌ లైసెన్స్‌ తీసుకోవాలని ఉండేది. ఎలాగైనా దాన్ని సాధించాలనుకున్నా. అలా బస్సు డ్రైవింగ్‌లో లైసెన్స్‌ కోసం శిక్షణ తీసుకుని పరీక్షల్లో పాసయ్యా. 2015 నుంచి ఓ స్కూల్‌ బస్సు డ్రైవరుగా పని చేస్తున్నా. పింక్‌ఐ బస్సులకు మహిళా డ్రైవర్లు కావాలన్నా పత్రికా ప్రకటన నా కంటపడింది. వెంటనే దరఖాస్తు చేసుకుని, ఎంపికయ్యా. ఆ తర్వాత బీఆర్టీఎస్‌ కారిడార్‌లో 15 రోజులు ప్రత్యేక శిక్షణకు హాజరయ్యా. రోజూ వేకువజామున మూడు నుంచి ఐదు గంటల వరకు బస్సు నడపడంలో ట్రైనింగ్‌ ఉండేది. మొదట్లో భయంగా ఉండేది. కలను సాధించాలంటే కష్టపడాలని నాన్న ప్రోత్సహించేవారు. అప్పుడే అనుకున్నదాన్ని సాధించగలవనేవారు. అలా నాపై నాకు నమ్మకం వచ్చింది. ఆ తర్వాత పింక్‌ఐ బస్సుకు డ్రైవరుగా ప్రయోగాత్మకంగా రోడ్డుపైకి ఎక్కా. ఈ విధుల్లో భాగంగా మహిళా ప్రయాణీకులను సురక్షితంగా గమ్యం చేర్చగలగుతాననే ఆత్మవిశ్వాసం ఇప్పుడు నాలో ఉంది’ అని చెబుతోంది రితూ.


డ్రైవింగ్‌ అంటే ఇష్టంతో.. అర్చనా కటారే

ఇండోర్‌కు చెందిన అర్చన, కుటుంబానికి ఆర్థికంగా చేయూతనందించడానికి డ్రైవింగ్‌ నేర్చుకుని, క్యాబ్‌ నడిపేది. ఆ తర్వాత ఓ ప్రైవేటు సంస్థలో డ్రైవరుగా పనిచేస్తూ, అక్కడే భారీ వాహనాలు నడపడంలో శిక్షణ తీసుకుంది. అలా మూడు నెలల్లోనే లైసెన్స్‌ పొందగలిగా అంటుందీమె. ‘స్థానికంగా ఓ స్టార్‌ హోటల్‌కు వచ్చే పర్యటకుల కోసం బస్‌ నడిపేదాన్ని. కొవిడ్‌ కారణంగా ఇంటికే పరిమితమైన నేను, పత్రికాప్రకటన చూసి అప్లై చేశా. అలా అక్కడ ఎంపికై, శిక్షణ తీసుకుని పింక్‌ ఐబస్‌కు డ్రైవరుగా బాధ్యతల్లో చేరా. రాష్ట్రంలో మహిళాప్రయాణీ¨కుల బస్సుకు తొలి మహిళా డ్రైవరుగా నిలవడం సంతోషంగా ఉంది’ అని అంటోంది అర్చన.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్