ముచ్చటైన మూడు ముళ్ల బంధం

వివాహ బంధం కలకాలం సంతోషంగా, హాయిగా కొనసాగాలంటే... ఆలుమగలు ఒకరికొకరు అన్నట్లు మారిపోవాలి. అందుకు ఏం చేయాలంటే...

Updated : 12 Jan 2022 05:42 IST

వివాహ బంధం కలకాలం సంతోషంగా, హాయిగా కొనసాగాలంటే... ఆలుమగలు ఒకరికొకరు అన్నట్లు మారిపోవాలి. అందుకు ఏం చేయాలంటే...

సమయం... మహిళ జీవిత భాగస్వామితో గడిపే సమయాన్ని అన్నింటి కంటే విలువైందిగా చూస్తుంది. తన కోసం కాస్త సమయం కేటాయించాలని కోరుకుంటుంది. నిజానికి ఇద్దరూ సమయం కేటాయించుకోవాలి. చాలామంది మహిళలు భాగస్వామి తన ఆలోచనలు, భావాలను తమతో పంచుకోవాలని కాంక్షిస్తారు. తామూ చిన్నపిల్లల్లా తమ ప్రతి విషయాన్నీ వాళ్లతో పంచుకోవాలని ఆరాటపడతారు. ఇవన్నీ జరగాలంటే ఏకాంతం కావాలి.

మెచ్చుకోలు..  తాము లేనప్పుడు భర్త, పిల్లలు, ఇతర కుటుంబ సభ్యులు పడే ఇబ్బందులను తలచుకుని బాధపడతారు. దాంతో ముఖ్యమైన కార్యక్రమాలున్నా కుటుంబం తర్వాతే అంటారు. ఇంతగా ఆలోచించే స్త్రీలు... భర్త నుంచి చిన్న ప్రశంసను కోరుకోవడంలో తప్పు లేదు కదూ. అలాగే ఇంటి గురించి అహర్నిశలు కష్టపడే భాగస్వామిని గౌరవించాలి. వారి కోసం కాస్త సమయాన్ని కేటాయించాలి.

స్నేహం...  ఏడడుగులు నడిచి వచ్చిన భర్తతో కలకాలం సాఫీగా సాగిపోవాలని ఆమె కోరుకుంటుంది. అలా సాగాలంటూ ఇద్దరూ చిరకాల స్నేహితుల్లా మెలగాలి. ఇరువురి తల్లిదండ్రులు, బంధువులు, స్నేహితుల పట్ల ఇద్దరూ ఆత్మీయంగా, మర్యాదగా ప్రవర్తించాలి. ఇది మీకు ఎదుటి వారిపై ఎంత గౌరవం ఉందో తెలుపుతుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్