నోబెల్‌ రెండు సార్లు!

శాస్త్ర, సాంకేతిక రంగాల్లో ఇచ్చే అత్యుత్తమ పురస్కారం నోబెల్‌ను అందుకున్న మొదటి మహిళ మేరీ క్యూరీ. రెండుసార్లు ఈ పురస్కారాన్ని పొందిన ఏకైక మహిళ కూడా ఆమే. భౌతిక, రసాయన శాస్త్రాల్లో చేసిన కృషికి ఈ గౌరవం దక్కింది. మేరీ పోలండ్‌లో నవంబరు 7, 1867లో పుట్టారు. పూర్తి పేరు మరియ సలొమియ స్క్లొడొస్క.

Published : 13 Mar 2022 01:44 IST

మీకు తెలుసా?

శాస్త్ర, సాంకేతిక రంగాల్లో ఇచ్చే అత్యుత్తమ పురస్కారం నోబెల్‌ను అందుకున్న మొదటి మహిళ మేరీ క్యూరీ. రెండుసార్లు ఈ పురస్కారాన్ని పొందిన ఏకైక మహిళ కూడా ఆమే. భౌతిక, రసాయన శాస్త్రాల్లో చేసిన కృషికి ఈ గౌరవం దక్కింది. మేరీ పోలండ్‌లో నవంబరు 7, 1867లో పుట్టారు. పూర్తి పేరు మరియ సలొమియ స్క్లొడొస్క. భౌతిక, గణిత, రసాయన శాస్త్రాల్లో డిగ్రీ పూర్తి చేశారు. 1895 భౌతిక శాస్త్రవేత్త పియరీ క్యూరీని వివాహం చేసుకున్నారు. పరిశోధనల్లో భాగంగా పిచ్‌బ్లెండ్‌, చాల్సైట్‌ ఖనిజాలు యురేనియం కంటే అధిక రేడియో ధార్మికతను కలిగి ఉన్నాయని కనుక్కున్నారు. భర్తతో కలిసి ‘పొలోనియం’ అనే ఖనిజాన్ని, ఆ తర్వాత 1898లో అధిక రేడియో ధార్మికత కలిగిన ‘రేడియం’ను కనుక్కున్నారు. ఈ ఆవిష్కరణ రేడియోథెరపీ, న్యూక్లియర్‌, వైద్య రంగాలకు ఎంతగానో ఉపయోగపడుతూ వస్తోంది. 1903లో మేరీ, పియరీలకు భౌతిక శాస్త్రంలో నోబెల్‌ బహుమతి సంయుక్తంగా లభించింది. భర్త మరణించాక తన ఇద్దరు అమ్మాయిలతో ఒంటరిగా మిగిలిపోయారు.. అయితే పరిశోధనను మాత్రం విడిచి పెట్టలేదు. ప్యారిస్‌ విశ్వవిద్యాలయంలో మొదటి మహిళా ఆచార్యురాలిగా సేవలందించారు. రేడియం, పొలోనియం మూలకాలను కనుక్కున్నందుకు ఆమెకు 1911లో నోబెల్‌ బహుమతి (రసాయన శాస్త్రంలో) వచ్చింది. మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో ఎక్స్‌రే పరికరాలు, వాహనాలు, మొబైల్‌ రేడియోగ్రఫీ యూనిట్లను అభివృద్ధి చేశారు.  నిరంతరాయంగా నిధుల సేకరణ, సిబ్బందికి శిక్షణ ఇవ్వడం, ఎక్స్‌- రే వ్యాన్‌ల పర్యవేక్షణ లాంటి ఎన్నో విధులు నిర్వహించారు. రేడియాలజీ పరిశోధనలకు నిలయమైన ఆస్పత్రి, ప్రయోగశాల కోసం యుద్ధం తర్వాత కూడా ఆమె నిధుల సేకరణనూ కొనసాగించారు.. పరిశోధనలనూ ఆపలేదు. చివరకు తాను కనుక్కున్న రేడియో ధార్మిక కిరణాల బారిన పడే 1934లో మరణించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్