బాధ్యతలేని భర్త... భరోసా పొందేదెలా?

పెళ్లైన పదేళ్లకు... ఓ ప్రమాదంలో నా భర్త మతిస్థిమితం కోల్పోయాడు. దాంతో తరచూ ఇల్లు వదిలి వెళ్తుంటాడు. దీనికి తోడు మా అత్త, ఆడపడుచుల మాటలు విని పిల్లల్నీ, నన్నూ ఇబ్బందులకు గురిచేస్తున్నాడు.

Updated : 19 Dec 2023 14:59 IST

పెళ్లైన పదేళ్లకు... ఓ ప్రమాదంలో నా భర్త మతిస్థిమితం కోల్పోయాడు. దాంతో తరచూ ఇల్లు వదిలి వెళ్తుంటాడు. దీనికి తోడు మా అత్త, ఆడపడుచుల మాటలు విని పిల్లల్నీ, నన్నూ ఇబ్బందులకు గురిచేస్తున్నాడు. అతడి ప్రవర్తనతో మా పెద్దబ్బాయి డిప్రెషన్‌లోకి వెళ్లిపోయాడు. వాడి చికిత్స, చిన్నోడి చదువులకి బోలెడు ఖర్చవుతోంది. నేను చిన్న ఉద్యోగం చేస్తూ వాళ్లని పోషించుకుంటున్నా. కానీ, నా శక్తి సరిపోవడం లేదు. మా కుటుంబానికి ఊళ్లో నాలుగెకరాల భూమి, ఇల్లు ఉన్నాయి. అందులో ఎకరం భూమిని మా మామగారు చనిపోవడానికి ముందు నా భర్త, అత్త, మామలు కలిసి అమ్మేశారని ఈ మధ్యే తెలిసింది. ఇప్పుడు వారి నుంచి ఎలాంటి ఆర్థిక భరోసా అందుకోగలమో సలహా ఇవ్వగలరు?

 ఓ సోదరి

ర్త బాధ్యతారహితంగా ఉంటే ఇంటి భారం అంతా భార్య మీదే పడుతుంది. మీ విషయంలోనూ అదే జరిగింది. కనీసం మీ అత్తామామలైనా మనవల భవిష్యత్తు ఆలోచించి ఏదైనా ఏర్పాటు చేసి ఉండాల్సింది. మీరు కూడా మొదటి సారి మీభర్త ఇంటి నుంచి వెళ్లి తిరిగివచ్చాక అయినా అత్తింటివారిని మీవారి వాటా ఆస్తి ఇవ్వమని అడగాల్సింది. మీ మామగారి పేరున ఉన్న పొలం, ఇల్లు మీ అత్త పేరు మీదకు మార్చుకున్నారా? ఒకవేళ ఆయన ఎటువంటి వీలునామా రాయకుండా చనిపోతే అది పిల్లలకు, భార్యకు సమానంగా చెందుతుంది. మీ మామగారు బతికి ఉండగానే భూమి అమ్ముకున్నట్లయితే అది స్వార్జితంగా భావించాల్సి వస్తుంది. అయినా సరే, మీ అత్తమామలు, భర్త కలిసి ఆ పొలం రిజిస్టర్‌ చేశారని చెబుతున్నారు. అప్పుడు మీ భర్తకు వారు ఎంతో కొంత ఇచ్చే ఉంటారు. ఆ డబ్బులు అతడేం చేశాడో తెలియదు. ఇక, మీ వారు ఎక్కడ ఉన్నారో తెలుసుకుని, మీ అత్తగారిని కూడా పార్టీ చేస్తూ గృహహింస కేసు వేయండి. అందులో పిల్లల విద్య,వైద్య ఖర్చులు, మీ పోషణకు అవసరమైన డబ్బులను నెలవారీ లేదా ఏక మొత్తంలో కోరుతూ పరిహారం కోరండి. డీవీసీ యాక్ట్‌లోని సెక్షన్‌ 20 కింద మానిటరీ రిలీఫ్స్‌, 22 ప్రకారం కాంపన్సేషన్‌ అడగొచ్చు. ఒకవేళ ఆస్తి మీ మామగారి పిత్రార్జితం అని తేలితే మీ అబ్బాయిలూ వాటా అడగొచ్చు. కానీ,  కోర్టుకి వెళ్తే ఈ సమస్యలు మరింత జటిలం కావొచ్చు. ముందు మధ్యవర్తుల ద్వారా ప్రయత్నించి చూడండి. అది సాధ్యం కాకపోతే అప్పుడు ఆలోచించి నిర్ణయం తీసుకోండి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్