ప్రేమంటే... ఏమంటాడో!

నా వయసు 24. రెండేళ్ల క్రితం ఓ అబ్బాయి పరిచయమయ్యాడు. తొందరగానే స్నేహితులమయ్యాం. అతనికి నేనంటే చాలా గౌరవం. ఇద్దరం ప్రేమలో విఫలమయ్యాం. ఆ సమయంలో ఒకరికొకరం అండగా నిలిచాం. అయితే కొంతకాలం నుంచి అతనిపై నాకు ఇష్టం ఏర్పడింది.

Updated : 05 Feb 2024 16:22 IST

నా వయసు 24. రెండేళ్ల క్రితం ఓ అబ్బాయి పరిచయమయ్యాడు. తొందరగానే స్నేహితులమయ్యాం. అతనికి నేనంటే చాలా గౌరవం. ఇద్దరం ప్రేమలో విఫలమయ్యాం. ఆ సమయంలో ఒకరికొకరం అండగా నిలిచాం. అయితే కొంతకాలం నుంచి అతనిపై నాకు ఇష్టం ఏర్పడింది. తనకూ నా ప్రేమ గురించి అర్థమైందని అనుకుంటున్నా. ఈ విషయంలో నేను బయటపడితే, ఒకవేళ తనకు ఇష్టం లేకుంటే మా స్నేహం చెడిపోతుందేమో అని భయంగా ఉంది. నేనేం చేయాలి?

ఓ సోదరి

మీ ఇద్దరూ కష్ట సమయంలో ఒకరికొకరు మద్దతుగా నిలిచారు. మంచి స్నేహితుల్లానూ ఉన్నారు. అప్పుడు మీ మధ్య ప్రేమలాంటిదేమీ లేదు. అతనికి కూడా మీపై ఆ దృష్టి ఉన్నట్లు కనిపించటం లేదు. మీరు మీ స్నేహాన్ని ప్రేమ వైపు మళ్లించుకున్నారు. అతని మీద గౌరవంతోనో.. అండగా ఉన్నాడనో అది ప్రేమలాగా అనిపిస్తూ ఉండొచ్చు. ఒకసారి ప్రేమలో విఫలమయ్యారు... స్నేహితునిగా సాయం చేశాడు. దాన్ని ప్రేమగా అనుకుని ముందుకెళ్లినట్లయితే ఒకవేళ అతను కాదంటే మీరు నిరుత్సాహపడతారు. స్నేహాన్ని మీరు అపార్థం చేసుకున్నారని అతను బాధపడే అవకాశమూ ఉంది. కాబట్టి స్నేహాన్ని కొనసాగిస్తూ, ఎట్టి పరిస్థితుల్లోనూ అతను బయటపడితే తప్ప మీరు బయటపడొద్దు. అప్పుడే స్నేహం, గౌరవం పోగొట్టుకోకుండా ఉంటారు. ఆడ, మగ మధ్యలో ఎప్పుడూ ప్రేమే ఉండాలని లేదు. స్నేహం కూడా ఉండొచ్చు. దాని మధ్యలో ప్రేమ వచ్చినప్పుడు బంధాలు ఎలా మళ్లుతాయో చెప్పలేం. అందుకే ప్రస్తుతానికి మీ ప్రేమను పక్కనపెట్టి, కొన్ని నెలల తర్వాత మీ మనసు ఎలా ఉంటుందో చూడండి. అతన్నీ అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. అంతవరకూ తొందరపడి మీరు బయటపడటం మంచిది కాదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్